రామాయణ్.. ఆదిపురుష్ కన్నా బెటరే!

బీ టౌన్ రామాయణ్ ప్రాజెక్ట్.. ఎలాంటి అనౌన్స్మెంట్, హడావుడి లేకుండా మొదలైపోయింది

Update: 2024-04-27 17:40 GMT

బీ టౌన్ రామాయణ్ ప్రాజెక్ట్.. ఎలాంటి అనౌన్స్మెంట్, హడావుడి లేకుండా మొదలైపోయింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ నితీష్ రామాయణ్ ను తెరకెక్కిస్తుండడం పక్కా. ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేసి షూటింగ్ మొదలుపెడతారని వార్తలు వచ్చాయి.

కానీ రామనవమికి రామాయణ్‌ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఇప్పట్లో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లదేమోనని చాలా మంది అనుకున్నారు. కానీ ఎలాంటి సౌండ్ లేకుండా మూవీ షూటింగ్‌ ను మొదలుపట్టేశారు నితీష్ తివారి. ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సీతమ్మగా నేచురల్ స్టార్ సాయి పల్లవి, రావణుడిగా హీరో యష్ నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీకైన విషయం తెలిసిందే. అందులో సీతాదేవిగా సాయిపల్లవి, రాముడిగా రణబీర్ కపూర్ గెటప్స్ లో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నెట్టింట ఆ పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. సీతాదేవిగా సాయి పల్లవి అదిరిపోయారు. ఆమె అందాన్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రణబీర్, సాయి పల్లవి పిక్స్ కోసమే చర్చ నడుస్తోంది.

ఆదిపురుష్ సినిమాకు గాను దర్శకుడు ఓం రౌత్ డిజైన్ చేసిన ప్రభాస్ లుక్స్ కన్నా రణబీర్ లుక్స్ బాగున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్లీన్ షేవ్ లో రణబీర్ కాస్త బాలేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఆదిపురుష్ కన్నా చాలా రెట్లు బెటర్ అని చెబుతున్నారు. రామాయణ్ ప్రాజెక్టు నుంచి రణబీర్, సాయి పల్లవి ఫోటోలు లీక్ అవ్వడంతో.. ఓం రౌత్ ను మరోసారి నెట్టింట భారీగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇక ఇప్పటి వరకు రామయణం మీద వచ్చిన సినిమాలన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. కానీ గత ఏడాది వచ్చిన ఆదిపురుష్ చిత్రం మాత్రం బోల్తా కొట్టింది. ఈ మూవీకి దారుణమైన ట్రోల్స్‌ కూడా వచ్చాయి. ఇప్పుడు నితీష్ రామాయణ్ ప్రాజెక్ట్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇప్పటి వరకు ఆయన క్యాస్టింగ్ ఎంపిక, ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న అప్డేట్స్ చూస్తుంటే ఈ రామాయణ్ అందరినీ ఆకట్టుకోవడం పక్కా అని చెప్పవచ్చు. మరేం జరుగుతుందో.

Tags:    

Similar News