బాక్సాఫీస్.. 'ఫైటర్' ఫైట్ గట్టిగానే ఉందిగా!

రిలీజ్ కు ముందు కాస్త తక్కువ బజ్ క్రియేట్ అయినా.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దుమ్మురేపుతోంది.

Update: 2024-01-28 12:53 GMT

బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపిక పదుకొణె జంటగా పాపులర్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఫైటర్. సస్పెన్స్ థ్రిల్లర్, దేశభక్తి తదితర అంశాలతో రూపొందిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కు ముందు కాస్త తక్కువ బజ్ క్రియేట్ అయినా.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

హృతిక్ కెరీర్‌లో వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన 14వ మూవీగా ఫైట‌ర్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌రికొత్త‌ రికార్డ్ క్రియేట్ చేసింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డే రోజున విడుద‌లై 100 కోట్ల గ్రాస్ సాధించిన హృతిక్ రోష‌న్‌ హ్యాట్రిక్ మూవీగా ఫైట‌ర్ నిలిచింది. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుండటంతో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇండియాలో ఫస్ట్ డే కన్నా మూడో రోజే ఎక్కువ వసూళ్లు సాధించిందీ మూవీ.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇండియాలో ఫైటర్ మూవీ ఫస్ట్ డే రూ.24.6 కోట్లు నెట్ వసూలు చేయగా.. రెండో రోజు రూ.41.20 కోట్లు రాబట్టింది. రెండ్రోజులు కలిపి దేశవ్యాప్తంగా ఈ మూవీకి రూ.78కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడో రోజు రూ.27.60 కోట్లు రాబట్టింది ఫైటర్. ఇప్పటి వరకు ఇండియాలో రూ.110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

మరోవైపు, ఓవర్సీస్ లో ఫైటర్ మూవీ డే 3 కలెక్షన్లు షాకింగ్ గా ఉన్నాయి. తొలిరోజు మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు 1.7 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇక మూడోరోజు భారీగా 5.2 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఫైటర్ కు రూ. 154 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 4000 స్క్రీన్లలో రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. లాంగ్ వీకెండ్‌ ను దృష్టిలో పెట్టుకుని అత్యధికంగా ప్రేక్షకులకు చేరువయ్యేలా మేకర్స్ ఏర్పాట్లు చేశారట. ఈ మూవీలో అనిల్‌క‌పూర్‌, అక్ష‌య్ ఒబెరాయ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. అశుతోష్ రాణా, తెలుగు నటుడు వినయ్ వర్మ, కరణ్ సింగ్ గ్రోవర్, రిషబ్ స్వానీ నటించారు. ఈ సినిమాను రూ.200 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. మరి సినిమా ఎంత లాభాలు తెచ్చి పెడుతుందో చూడాలి.

Tags:    

Similar News