1000 కోట్లు టార్గెట్ గా 'సలార్'.. 'జవాన్'!
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాలు పతాక స్థాయికి చేర్చాయి
ఒక్క హిట్ తో బాలీవుడ్ పై విమర్శలన్నింటిని 'పఠాన్' తుడిచిపెట్టిన సంగతి తెలిసిందే. కోవిడ్ తర్వాత తీవ్ర విమర్శలపాలై విజయం కోసం వెంపర్లాడుతోన్న సమయంలో 'పఠాన్' 1000 కోట్ల గ్రాస్ వసూళ్లతో విమర్శల న్నింటికి చెక్ పెట్టింది. ఈ ఏడాది 1000 కోట్లు వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ నిలిచింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' ఆ వసూళ్లని బ్రేక్ చేస్తుందని అంచనాలు క్రియేట్ అయినా..అది బాక్సాఫీస్ వద్ద విఫలమైన సంగతి తెలిసిందే.
400 కోట్ల వసూళ్లతోనే సరిపెట్టు కోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది 'పఠాన్' వసూళ్లే ఇప్పటివరకూ అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' ని కొట్టే సినిమాల జాబితాలో ప్రధానంగా ఓ తెలుగు సినిమా- ఓ హిందీ సినిమా కనిపిస్తుంది. అందులో ఒకటి షారుక్ నటిస్తోన్న 'జవాన్' కావడం విశేషం. అట్లీ దర్శకత్వం వహిస్తోనన సినిమా పై భారీ అంచనాలున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాలు పతాక స్థాయికి చేర్చాయి. వచ్చే నెలలో సినిమా రిలీజ్ అవ్వడంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అమెరికా.. జర్మనీ, మిడిల్ ఈస్ట్ మరియు UK వంటి ప్రాంతాల్లో బుకింగ్స్ జోరుగా కనిపించే ఛాన్స్ ఉంది. మౌత్ టాక్ బాగుంటే తమిళం-తెలుగు వెర్షన్లు ఈ సినిమాను ఆదరించే అవకాశం ఉంది. అట్లీకి ఇంతవరకూ వైఫల్యం లేదు. చేసిన సినిమా ప్రతీది హిట్ ఖాతాలో పడ్డదే. దీంతో సినిమాకి హిట్ టాక్ వస్తే 1000 కోట్ల మార్క్ ని సునాయాసంగా దాటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
అలాగే మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సలార్' కూడా భారీ అంచనాల మధ్య వచ్చె నెలలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు భారీ హైప్ తీసుకొచ్చాయి. 'కేజీఎఫ్-2' తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో పాన్ ఇండియా వైడ్ కాక మామూలుగా లేదు. ప్రభాస్ పరాజయాల లెక్కలన్నింటిని సలార్ సరి చేస్తుందని అంచనాలున్నాయి. టాక్ బాగుంటే 'సలార్' 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని గెస్సింగ్ వస్తున్నాయి. ఇక విజయ్ హీరోగా లోకష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లియో' పై కూడా భారీ అంచనాలున్నాయి. విజయ్ కి పాన్ ఇండియా మార్కెట్ లేనప్పిటికీ 'విక్రమ్' తో ఫేమస్ అయిన లోకేష్ బ్రాండ్ తో మంచి టాక్ తెచ్చుకుంటే భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనాలున్నాయి.