పాన్ ఇండియా స్టార్ పై బోయపాటి కన్ను..!

కానీ, తదుపరి సినిమా మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా అయ్యి ఉండాలని అనుకుంటున్నారట.

Update: 2023-09-05 14:41 GMT

టాలీవుడ్ మాస్ యాక్షన్ మూవీస్ తీయడంలో బోయపాటి ఒకరు. ఆయన ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. సూపర్ హిట్లను అందించారు. ప్రస్తుతం రామ్ పోతినేనితో స్కంద మూవీ చిత్రీకరించారు. ఈ మూవీ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి స్కంద ట్రైలర్ కూడా విడుదల చేశారు.

ఫుల్ యాక్షన్ లోడెడ్ మూవీ అనే విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమౌతోంది. ప్రస్తుతం స్కంద ప్రమోషన్స్ విషయంలో బోయపాటి బిజీగా ఉన్నారు. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత ఆయన బాలయ్యతో మరో సినిమా చేయాలని అనుకుంటున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా ఇప్పటి వరకు తేడా కొట్టింది లేదు. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. ఇదే కంటిన్యూ చేయడానికి తన ఫేవరేట్ హీరో బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

అయితే, ఆ తర్వాత బోయపాటి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బోయపాటి ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. రామ్ కి ఇతర భాషల్లో మార్కెట్ లేకపోవడంతో, స్కంద కూడా ఇతర భాషల్లో విడుదల చేయడం లేదు. కానీ, తదుపరి సినిమా మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా అయ్యి ఉండాలని అనుకుంటున్నారట.

అందుకోసం పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోని ఎంచుకోవాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ని లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. పుష్పతో అల్లు అర్జున్ జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి హీరో అయితేనే తన మార్కెటింగ్ కి బాగుంటుంది అనేది బోయపాటి ఆలోచన.

ప్రస్తుతం అయితే కథ సిద్ధం చేసుకుంటున్నాడట. త్వరలోనే అల్లు అర్జున్ కి వినిపించే అవకాశం ఉంది. ఆయన ఒకే అంటే, బాలయ్య సినిమా తర్వాత ఇది లైన్ లో పెట్టే అవకాశం ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సరైనోడు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి, బన్నీ కూడా ఈజీగానే ఒప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక స్కంద మూవీ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags:    

Similar News