పాపులర్ డైరెక్టర్స్ తో కంప్లైంట్స్ లేవు..!
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బ్రహ్మాజి తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు బ్రహ్మాజి. ఎన్నో ఏళ్లుగా తెలుగు పరిశ్రమలో ఉంటూ తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. సినిమాలో చిన్న పాత్రైనా సరే తన వంతుగా చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం బ్రహ్మాజి లీడ్ రోల్ లో బాపు అనే సినిమా చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బ్రహ్మాజి తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పారు.
తాను ఇప్పుడు సినిమాలన్నీ పెద్ద డైరెక్టర్స్ తోనే చేస్తున్నానని ఐతే యువ దర్శకులతో కూడా పనిచేస్తున్నానని అన్నారు. ఐతే కొందరు దర్శకులు కథ ఒకలా చెప్పి సినిమా మరోలా చేస్తారని.. కొందరు చెప్పడం సరిగా చెప్పకపోయినా ఎగ్జిక్యూషన్ బాగుంటుందని అన్నారు బ్రహ్మాజి. కొన్ని సినిమాలు మధ్యలోనే అది తెలుస్తుందని ఐతే ఇప్పుడు తాను అన్ని సినిమాలు పాపులర్ డైరెక్టర్స్ తో చేస్తున్నా కాబట్టి వాళ్లతో ఎలాంటి కంప్లైంట్స్ లేవని అంటున్నారు బ్రహ్మాజి.
సినిమాలో సైడ్ రోల్స్ నుంచి లీడ్ రోల్ చేస్తూ ఇప్పటికీ సపోర్టింగ్ రోల్ లో నటిస్తూ వస్తున్నారు బ్రహ్మాజి. సినిమాలో ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం చేసారు బ్రహ్మాజి. ఆయన అనుభవం ఈ తరం యువ దర్శకులకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఆయన ఏ చిన్న ఛాన్స్ కూడా వదిలి పెట్టకుండా చేస్తుంటారు. కొన్నాళ్లు మధ్యలో కెరీర్ అటు ఇటుగా ఉన్నా ఈమధ్య మళ్లీ ఆయన వరుస సినిమాలతో మంచి పాత్రల్లో కనిపిస్తున్నారు.
బ్రహ్మాజి స్పెషల్ రోల్ చేస్తే ఆ సినిమా పక్కా హిట్ అనే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నారు ఆయన. బ్రహ్మాజి నటించిన బాపు సినిమా ఒక మంచి ఎమోషనల్ మూవీగా వస్తుంది. సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఎంగేజ్ చేయగా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. బ్రహ్మాజి నటించిన బాపు సినిమాను దయ డైరెక్ట్ చేశారు. బలగం సినిమా తర్వాత మరో ఎమోషనల్ మూవీగా బాపు వస్తుంది. బ్రహ్మాజి ఎప్పుడు సరదాగా ఉన్న పాత్రలే చేస్తుంటారు. ఆయన ఎమోషనల్ రోల్ చేసి చాలా కాలం అయ్యింది. బాపు సినిమాలో ఆయన పాత్ర కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుందని అనిపిస్తుంది.