మొదటి రోజు బాక్సాఫీస్.. లెక్క తప్పలేదు 'బ్రో'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ బ్రో

Update: 2023-07-29 06:18 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ బ్రో సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది. రివ్యూలు కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం బాగానే కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ఎనర్జీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ సినిమా అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గెస్ట్ పాత్రగా అంతకుమించి అనే స్థాయిలోనే ఉండడంతో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది.

సినిమా స్క్రీన్ టైంలో పవన్ ఎక్కువగా కనిపించాడు, దీంతో దానికి తోడు సినిమాలో మంచి ఎమోషన్స్ వర్కౌట్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు వర్షాకాలం ప్రభావం ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ విషయంలో అయితే ఏమాత్రం తేడా రాలేదు. దానికి తోడు రెండు రాష్ట్రాల్లో టిక్కెట్ల రేట్లు పెద్దగా పెంచింది లేదులేదు. బెనిఫిట్ షో లు కూడా ఈసారి పెద్దగా పడింది లేదు.

ఎలా చూసుకున్నా కూడా బ్రో సినిమా ఈసారి అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోదేమో అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా అవన్నీ అంతరాలు ఉన్నప్పటికీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 35 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 54 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. టిక్కెట్ల రేట్లు నార్మల్ గా ఉంటేనే ఈ రేంజ్ లో వచ్చాయి అంటే.. ఇక పెంచి ఉంటే ఈ స్థాయిలో వచ్చేవో ఊహించుకోవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా 36 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.10 కోట్ల రాగా ఓవర్సీస్ లో 4.30 కోట్లు వచ్చాయి. ఇక ఈ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్లో 97 కోట్ల రేంజ్ లో అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సక్సెస్ కావాలి అంటే మొత్తం 98 కోట్లు అందుకోవాలి.

ఇక ఇప్పుడు దాదాపు 35 కోట్లకు పైగానే షేర్ వచ్చింది కాబట్టి మరో 63 కోట్లు షేర్ అందుకోవాల్సి ఉంటుంది. వీకెండ్ లో మాత్రం సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమాకు అట్రాక్ట్ కాబోతున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ కెరీర్ లో కూడా ఈ బ్రో బిగ్గెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలవబోతున్నట్లు అర్థమవుతుంది.

Tags:    

Similar News