BRO సినిమాలో ఆ సీన్స్.. ఏపీ మంత్రిపై రివెంజ్?
జనసేనాని పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేసే వైసీసీ మంత్రి అంబటి పై రివెంజ్ ఇది అంటూ నెటిజనుల్లో చర్చ సాగుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రో' నేడు థియేటర్లలోకి విడుదలై పాజిటివ్ సమీక్షల ను అందుకుంది. అయితే ఈ సినిమా లో 30 ఇయర్స్ పృథ్వీ పాత్ర నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ పాత్రను అసందర్భంగా దేనికోసం ఇరికించారు? అన్న చర్చా సాగుతోంది.
అసలు సినిమా కథతో సంబంధం లేని పాత్రలో పృథ్వీ కనిపించాల్సిన అవసరం ఏంటి? అంటే.. జనసేనాని పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేసే వైసీసీ మంత్రి అంబటి పై రివెంజ్ ఇది అంటూ నెటిజనుల్లో చర్చ సాగుతోంది. అపుడెపుడో సంక్రాంతికి అంబటి డ్యాన్సులు చేసిన వీడియో అంతర్జాలం లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దాని పై సెటైరికల్ గా పృథ్వీ పాత్రను బ్రో లోకి జొప్పించారు. అప్పట్లో అంబటి వేసుకున్న అదే రంగు షర్ట్ ని ధరించి పృథ్వీ డ్యాన్సులు చేయడాన్ని బ్రో సినిమా లో ఫన్నీగా చూపించారు.
పబ్ లో కనిపించిన రెండుసార్లు అసలు డైలాగ్ అన్నదే లేకుండా కేవలం డ్యాన్స్ మూవ్ మెంట్ తో కనిపిస్తాడు పృథ్వీ. ఆ డాన్స్ పై పవన్ పంచ్ వేస్తారు. ఇదంతా వైసీపీ నేత అంబటి రాంబాబు పై సెటైర్ అన్న ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఆ సన్నివేశం పై సోషల్ మీడియా లో కౌంటర్లు మొదలైపోయాయి.
పవన్ కల్యాణ్ ర్యాగింగ్ ఓ రేంజ్ లో ఉందంటూ జనసైనికు లు సంబర పడుతుంటే.. రాజకీయాల్లో చేసేదేం లేక ఇలా సినిమాల్ని అడ్డం పెట్టుకొని తృప్తి పొందుతున్నారని వైసీపీ కార్యకర్తలు పవన్ ని ఎద్దేవా చేస్తున్నారు. బ్రో తమిళ చిత్రం వినోదం సీతాయం కి రీమేక్. సముద్రఖని దర్శకత్వం వహించారు.