పాక్‌, బంగ్లాలోనూ మన 'బ్రో' ట్రెండింగ్

మరింత ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ సినిమా పాకిస్తాన్‌ లో మరియు బంగ్లాదేశ్ లోనే నెట్‌ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులు తెగ చూస్తున్నారు.

Update: 2023-08-30 12:42 GMT

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ముఖ్య పాత్రల్లో నటించిన బ్రో సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది అంటూ రివ్యూలు వచ్చాయి. వసూళ్ళ పరంగా కూడా ఫ్యాన్స్ మరియు నిర్మాతలు ఆశించిన స్థాయి లో రాలేదు అనేది టాక్.


ఆ విషయం పక్కన పెడితే తాజాగా బ్రో సినిమా నెట్‌ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ అయింది. గత వారం నుండి కూడా ఈ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది. ఆగస్టు 21 నుంచి 27 మధ్య సేకరించిన డేటా ప్రకారం నెట్ ఫ్లిక్స్ లో బ్రో సినిమా కంటిన్యూగా ట్రెండింగ్ లోనే కొనసాగుతుంది.

ఇండియా లో నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్‌ లో నెం.1 స్థానంలో నిలిచిన బ్రో ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇంగ్లీష్‌ కానీ సినిమాల విభాగంలో 7వ స్థానంలో ఉంది. మరింత ఆసక్తికర విషయం ఏంటి అంటే ఈ సినిమా పాకిస్తాన్‌ లో మరియు బంగ్లాదేశ్ లోనే నెట్‌ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులు తెగ చూస్తున్నారు. ఆయా దేశాల్లో బ్రో సినిమా 8వ స్థానంలో నిలిచింది.

వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా రూపొందినప్పటికి త్రివిక్రమ్‌ మార్క్ డైలాగ్స్ తో పాటు ఆయన మార్క్ స్క్రీన్‌ ప్లే ఉండటం తో తెలుగు ప్రేక్షకులు ఓటీటీ లో తెగ ఆధరిస్తున్నారు. విదేశాల్లో కూడా ఈ సినిమాను చూడటం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా లో పవన్‌, సాయి ధరమ్ తేజ్‌ తో పాటు కేతికా శర్మ ఇంకా ప్రియా ప్రకాష్, వెన్నెల కిషోర్‌ నటించిన ఈ సినిమా కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో రూపొందింది. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్‌ దేవుడి గా కనిపించడం విశేషం.


Tags:    

Similar News