బుచ్చిబాబు కూడా శంకర్ రేంజ్ లో?
కానీ బుచ్చిబాబు మాత్రం శంకర్ ని మించి సెట్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.
శంకర్ సినిమాలో ఉండే భారీతనం గురించి చెప్పాల్సిన పనిలేదు. భారీ సెట్లు..విదేశీ లొకేషన్లు ఇలా హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఆయన విజన్ కి తగ్గట్టు ప్రతీ ప్రేమ్ ను ఎంతో పక్కాగా డిజైన్ చేసుకుంటారు. ఔట్ డోర్ షూటింగ్ అయినా? అక్కడ భారీ తనం కనిపిస్తుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా? కోట్ల రూపాయ లు ఖర్చు అవుతుంది. అనుకున్న బడ్జెట్ కంటే అధికమవుతుంది. అలా మద్యలో బ్రేక్ పడి మళ్లీ మొదలైన సినిమాలు చాలా ఉన్నాయి.
శంకర్ పై ప్రధానంగా ఉన్న విమర్శ ఇది. ప్రస్తుతం రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయినా నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా శంకర్ అడిగిన ప్రతీది క్షణాల్లో సిద్దం చేసిన ఆయన ముందు పెట్టారు. ఇదంతా కేవలం శంకర్ బ్రాండ్ తోనే సాధ్యమవుతుంది.
అయితే ఇప్పుడు ఆర్సీ 16 చిత్రానికి కూడా అదే రేంజ్ లో ఖర్చు అవుతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవలే మైసూర్ లో పది రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారు.
అందుకోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల కోసం ఆ సెట్ ని డిజైన్ చేస్తున్నారుట. సెట్ ఇలా ఉండాలి? అని అర్ట్ డైరెక్టర్ కాకుండా బుచ్చిబాబు కొన్ని రిఫరెన్స్ లు ఇవ్వడంతో ఆయన విజన్ కు తగ్గట్టు రూపొందిస్తున్నారుట. సెట్ చాలా రిచ్ లుక్ లో ఉంటుందిట. శంకర్ సినిమా సెట్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందని అంటున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా లీకైంది. శంకర్ కూడా 'గేమ్ ఛేంజర్' సెట్స్ కోసం 10 కోట్లు ఖర్చు చేయలేదుట. ఆ సినిమా సెట్ హాయ్యెస్ట్ నిర్మాణం ఖర్చు 6 కోట్ల లోపే జరిగిందిట. కానీ బుచ్చిబాబు మాత్రం శంకర్ ని మించి సెట్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.