RC 16: ఇదెక్కడి ట్విస్ట్ బుచ్చిబాబు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది

Update: 2024-08-23 04:41 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఆచార్య మూవీ రామ్ చరణ్ పూర్తిస్థాయి హీరో కాదు. మెగాస్టార్ చిరంజీవి చిత్రంగా తెరకెక్కింది. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాని రామ్ చరణ్ పూర్తి చేశాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న సినిమా గేమ్ చేంజర్ కావడం విశేషం.

ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా చరణ్ కెరియర్ బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నెక్స్ట్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా లాంచింగ్ అయిపొయింది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోంది. మూవీలో క్యారెక్టర్ కి సంబందించిన లుక్ మేకోవర్ కోసం రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నాడు.

ఆ లుక్ రెడీ అవ్వగానే RC16 మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పీరియాడికల్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఉంటుందనే ప్రచారం నడిచింది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం నడుస్తుందని గతంలో రివీల్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్ లోనే మాట్లాడుతుందని టాక్ బయకొచ్చింది. కొంత ప్యాడింగ్ కోసం బుచ్చిబాబు ఉత్తరాంధ్ర నేపథ్యం ఉన్న కొత్త యాక్టర్స్ ని ఎంపిక చేశారు.

ఈ సినిమా కంప్లీట్ మాస్ కథాంశంతో ఉంటుందని అందరూ భావించారు. అయితే రామ్ చరణ్ సడెన్ గా ఈ మూవీ గురించి ఓ ఇంటరెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇస్తూ కొత్త విషయాన్ని చెప్పారు. బుచ్చిబాబు సానాతో చేయబోతున్న సినిమా కామెడీ జోనర్ లో ఉంటుందని రామ్ చరణ్ చెప్పాడు. ఇప్పటి వరకు కామెడీ జోనర్ టచ్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలో కామెడీ టచ్ తో కథ ఉంటుందని రివీల్ చేశాడు.

ఈ మాటతో RC16 సినిమాపై ఏవో కథలు ఊహించుకున్న అందరికి ఒక్కసారి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇదేదో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో ఊరమాస్ కథాంశంతో ఉంటుందని అందరూ భావించారు. అయితే కామెడీ ఎలిమెంట్స్ తో ఈ మూవీ కథాంశం ఉంటుందని రివీల్ చేయడం ద్వారా ఊహించని ట్విస్ట్ ఇచ్చారనే మాట వినిపిస్తోంది. రామ్ చరణ్ ఇప్పటి వరకు కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్స్ అయితే చేయలేదు.

ఆయన ఎక్కువ సీరియస్ టోన్ లో ఉన్న క్యారెక్టర్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ పూర్తి స్థాయిలో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేసి మెప్పించారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా తండ్రి చిరంజీవిని ఫాలో అవుతూ తనలోని కామెడీ యాంగిల్ ని కూడా ఫ్యాన్స్ కి పరిచయం చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News