టాప్ లో బుజ్జి అండ్ భైరవ.. క్రేజ్ అలా ఉంది మరి!
అయితే మూవీ ప్రమోషన్స్ కూడా వినూత్న రీతిలో నిర్వహించారు నాగ్ అశ్విన్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ టాలెంట్ పట్ల అనేక మంది ప్రశంసలు కురిపించారు. అదిరిపోయే సినిమా తీశారని కొనియాడారు. అయితే మూవీ ప్రమోషన్స్ కూడా వినూత్న రీతిలో నిర్వహించారు నాగ్ అశ్విన్. క్రేజీ అప్డేట్స్ ఇస్తూ మూవీపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేశారు.
అది సినిమాకు బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. అయితే మూవీ రిలీజ్ కు ముందు నాగ్ అశ్విన్ జర్నీ ఆఫ్ కల్కి పేరుతో మాట్లాడిన వీడియోస్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అంతకుముందు కల్కి ప్రపంచాన్ని మరింత అర్థమయ్యేలా చేయడానికి బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ యానిమేటెడ్ సిరీస్ వేరే లెవెల్ లో హిట్ అయింది.
ఇప్పుడు ఆ యానిమేటెడ్ సిరీస్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 2024 ఫస్టాఫ్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమాలు/ సిరీసుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 4.9 మిలియన్ల వ్యూస్ తో తొలి స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ఓర్మాక్స్ సంస్థ జాబితాను విడుదల చేసింది. దీని బట్టి చూస్తే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ఈజీగా అర్థమవుతుంది.
ఈటీవీ విన్ లోని 90స్ ఒక మిడిల్ క్లాస్ బయోపిక్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో మిస్ పర్ఫెక్ట్ (డిస్నీ+ హాట్స్టార్) 3.1 మిలియన్ల వీక్షణలతో ఉంది. SIT మూవీ (Zee5) 2.8 మిలియన్ల వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉండగా, భామాకలాపం 2 (ఆహా) 2.7 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంటర్నేషనల్ షోస్ క్యాటగిరీలో ది బాయ్స్ S4 (అమెజాన్ ప్రైమ్ వీడియో) 10.5 మిలియన్ వీక్షణలతో తొలి స్థానంలో ఉంది.
జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ S2.. 8.2 మిలియన్ వీక్షణలతో రెండో స్థానంలో ఉంది. ఫాల్ అవుట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) 8.0 మిలియన్ వీక్షణలతో మూడో స్థానాన్ని, 3 బాడీ ప్లాబ్రమ్ (నెట్ ఫ్లిక్స్) - 6.9 మిలియన్ వీక్షణలతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి. బ్రిడ్జర్టన్ S3 (నెట్ ఫ్లిక్స్) - 6.0 మిలియన్ వీక్షణలతో ఐదో స్థానంలో ఉంది.