బన్నీ అంత రిస్క్ తీసుకుంటాడా..?

రాం తో చేసిన స్కంద కూడా నిరాశ పరిచింది. సో ఈ టైం లో అల్లు అర్జున్ బన్నీతో సినిమా అంటే కచ్చితంగా రిస్క్ అనే చెప్పొచ్చు.

Update: 2023-10-14 08:30 GMT

పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పుష్ప 2 నెక్స్ట్ ఇయర్ ఆగష్టులో రిలీజ్ లాక్ చేశారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమాల ప్లానింగ్ ఏంటన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ త్రివిక్రమ్ తో సినిమా ఫిక్స్ అవగా ఆ ప్రాజెక్ట్ తర్వాత ఎవరి సినిమా ముందు ఎవరి సినిమా వెనుక అన్నది తెలియాల్సి ఉంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా తో కూడా సినిమా లైన్ లో ఉంది.

అయితే అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను సినిమా కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. సరైనోడుతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ కాంబోలో మరో సినిమా ప్లానింగ్ లో ఉందని టాక్. స్కంద రిలీజ్ టైం లో బోయపాటి శ్రీను ఆ విషయాన్ని చూచాయగా చెప్పారు. అయితే బోయపాటి సినిమాలన్నీ ఒకే పంథాలో ఉంటాయి. బాలకృష్ణకు తప్ప మరో హీరోకి హిట్ ఇచ్చిన పరిస్థితి లేదు. అల్లు అర్జున్ తో సరైనోడు మాత్రం హిట్ అయ్యింది.

రాం తో చేసిన స్కంద కూడా నిరాశ పరిచింది. సో ఈ టైం లో అల్లు అర్జున్ బన్నీతో సినిమా అంటే కచ్చితంగా రిస్క్ అనే చెప్పొచ్చు. బన్నీతో చేయాలని బోయపాటి రెడీ అంటున్నాడు తప్ప అటు వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాడు. సో బోయపాటి శ్రీనుతో సినిమా చేసినా కథ కొత్తగా ఉంటేనే ఓకే చెప్పే అవకాశం ఉంటుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ని అందుకోవడం కష్టమే మరి అలాంటిది రొటీన్ సినిమాలు చేసే బోయపాటి శ్రీను కి బన్నీ ఛాన్స్ ఇస్తాడా అన్న డౌట్ కూడా ఉంది.

అల్లు అర్జున్ తన సినిమాల ప్లానింగ్ తో అల్లు ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నాడు. బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబో కచ్చితంగా మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ అందించే ఛాన్స్ ఉంది. పుష్ప 2, త్రివిక్రమ్ సినిమా ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసేలా చేయాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ మెగా ప్లానింగ్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Tags:    

Similar News