బిజినెస్‌మేన్ : వర్మ - సూర్య నుంచి పూరి - మహేష్
అలాంటి బిజినెస్‌మేన్ సినిమా వెనుక ఆసక్తికర సంఘటనలు జరిగిన విషయం తాజాగా బయటకు వచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రత్యేక సినిమాలు ఏంటి అంటే బిజినెస్‌మేన్ ఒకటి అంటూ ఆయన అభిమానులు ఎలాంటి సందేహం లేకుండా చెప్తారు. అలాంటి బిజినెస్‌మేన్ సినిమా వెనుక ఆసక్తికర సంఘటనలు జరిగిన విషయం తాజాగా బయటకు వచ్చింది.
బిజినెస్‌మేన్ సినిమా స్టోరీ లైన్ మొదట వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వచ్చిందట. ఆ లైన్ ను పూరి కి చెప్పి పూర్తి స్థాయి కథ ను రెడీ చేయాల్సిందిగా చెప్పాడట. ఆ కథ ను పూరి తనదైన శైలిలో పూర్తి చేయడంతో వర్మ ఇంప్రెస్ అయ్యి... నువ్వే దర్శకత్వం చేయమని సూచించాడట.
మొదట బిజినెస్‌మేన్ కథతో తమిళ హీరో సూర్య వద్దకు పూరి జగన్నాధ్ వెళ్లాడట. ఆ సమయంలో కథ నచ్చినా కూడా చేతిలో పలు సినిమాలు ఉన్న కారణంగా సూర్య చేయలేను అన్నాడట. దాంతో కథ మహేష్ బాబు వద్దకు వెళ్లింది. ఆ సమయంలో పూరి పై ఉన్న నమ్మకంతో మహేష్ బాబు బిజినెస్‌మేన్ చేశాడు.
అంతకు ముందు పోకిరి సినిమా చేసి సూపర్ హిట్ దక్కించుకున్న కారణంగా మరో సారి అలాంటి సినిమాను, అంతటి విజయాన్ని పూరి ఇస్తాడనే నమ్మకంతో మహేష్ బాబు బిజినెస్‌మేన్ కి ఓకే చెప్పాడు. ఇద్దరి కాంబోలో పోకిరి తర్వాత వచ్చిన సినిమా అవ్వడంతో భారీ ఎత్తున బజ్ క్రియేట్ అయ్యింది.
సినిమాకు వచ్చిన బజ్ తో మంచి ఓపెనింగ్ వసూళ్లను నమోదు చేసింది. మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపొందిన బిజినెస్‌మేన్ సినిమా యావరేజ్ టాక్ దక్కించుకున్నా కూడా నిర్మాతకు మంచి లాభాలను తెచ్చి పెట్టిందని అప్పటి బాక్సాఫీస్ వర్గాల టాక్.
మొత్తానికి బిజినెస్‌మేన్ స్టోరీ లైన్ ను రామ్ గోపాల్ వర్మ ఆలోచిస్తే, దాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కథగా మలచి, మొదట సూర్య వద్దకు తీసుకు వెళ్లి, ఆయన బిజీగా ఉన్నాను ఇప్పుడు చేయలేను అని చెప్పడంతో మహేష్ బాబు వద్దకు వెళ్లాడు. అలా బిజినెస్‌మేన్ ప్రీ మేకింగ్ జర్నీ సాగింది.