'పుష్ప 2'కి బ్లాక్ బస్టర్ సరిపోదు!
ఇతర భాషల ఫిల్మ్ మేకర్స్ సైతం పుష్ప 2 పై పాజిటివ్‌గా స్పందించడం విశేషం.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు పుష్ప 2 కి పాజిటివ్‌గా రివ్యూలు ఇస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ సైతం పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించినట్లుగా పోస్ట్ చేశారు. ఇంకా ఎంతో మంది పుష్ప 2 సినిమాపై పాజిటివ్‌గా వ్యాఖ్యలు చేయడంతో ఆయా భాషల్లో సినిమాకు మరింతగా హైప్ క్రియేట్ అవుతోంది. ఇతర భాషల ఫిల్మ్ మేకర్స్ సైతం పుష్ప 2 పై పాజిటివ్‌గా స్పందించడం విశేషం.
పుష్ప 2 సినిమాపై తాజాగా ప్రముఖ తెలుగు దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా... అల్లు అర్జున్, సుకుమార్ గార్ల కాంబినేషన్ అద్భుతం. హీరో ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్, సీఎం సీన్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా జాతర సన్నివేశం గూస్‌బంప్స్ తెప్పించింది. ఒక్క సినిమాలో ఇన్ని అద్భుతాలు ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. పుష్ప 2 సినిమాలో ఈ అన్ని అనుభవాలు పొందుతారు. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ అనే పదం తక్కువ అవుతుందిఅని ట్వీట్ చేశారు.
ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. సినిమా విడుదలకు ముందు నుంచే పుష్ప 2 గురించి ఆయన కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇది వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ అంటూ తనదైన శైలిలో పోస్ట్ చేయడం జరిగింది. సినిమాలోని అల్లు అర్జున్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా జాతర సన్నివేశంలో అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డు రావల్సిందే అంటూ అభిమానులతో పాటు పలువురు సినీ వర్గాల వారు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది. ఇది సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ సైతం అద్భుతంగా ఉంది. సినిమాలో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కిస్సిక్ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి సినిమా వాళ్లకు, వీళ్లకు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కింది అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. రికార్డ్ స్థాయి మొదటి రోజు వసూళ్లు నమోదు కాబోతున్నాయి.