హీరోయిన్స్ ను ఆడిగేందుకు ప్రశ్నలే లేవా?

అక్కడి మీడియా గామి టీమ్ ను పలు ప్రశ్నలు అడగ్గా.. వారంతా సమాధానాలు ఇచ్చారు. కానీ చాందిని చౌదరీని మాత్రం ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగలేదు.

Update: 2024-03-14 07:52 GMT

తెలుగు అందం చాందినీ చౌదరి గురించి అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ దూసుకుపోతోంది. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో సందడి చేస్తోంది. ఇప్పటికీ చాందిని క్రేజ్, ఫేమ్ అలానే ఉంది. ఇటీవల విశ్వక్ సేన్ మెయిన్ రోల్ లో నటించిన గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన విడుదలైందీ మూవీ.

ఫస్ట్ షో నుంచే మంచి టాక్ దక్కించుకున్న ఈ మూవీ.. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు రూ.25 కోట్లకుపైగా రాబట్టింది. అయితే ఈ మూవీతో ఫస్ట్ థియేట్రికల్ హిట్ కొట్టింది చాందిని. డాక్టర్ జాహ్నవి రోల్ లో నటించి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. సినిమా కోసం ఎన్నో రిస్కులు చేసింది. షూటింగ్ టైమ్ లో హిమాలయాల్లో ఎన్నో కష్టాలు పడింది.

ఇక మూవీ రిలీజ్ అయ్యాక.. చాందినిని అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉన్న గామి టీమ్.. తాజాగా తిరుమల వెళ్లింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం.. తిరుపతిలోని ఓ థియేటర్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. కాగా, ఈ ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్ సేన్, చాందినీ చౌదరి, డైరెక్టర్ విద్యాధర్ పాల్గొన్నారు.

అక్కడి మీడియా గామి టీమ్ ను పలు ప్రశ్నలు అడగ్గా.. వారంతా సమాధానాలు ఇచ్చారు. కానీ చాందిని చౌదరీని మాత్రం ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. దీంతో చివర్లో చాందినినే మీడియాతో మాట్లాడింది. గామి సినిమా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఆ సమయంలో తన అసంతృప్తిని మీడియా ముందు బహిరంగంగా వ్యక్తం చేసింది.

ఎప్పుడూ మీడియాకు హీరోయిన్లను అడిగేందుకు ప్రశ్నలు ఉండవు.. మేల్ యాక్టర్స్, డైరెక్టర్స్‌ను మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.. ఇది నేను ఎప్పటి నుంచో చూస్తున్నానంటూ వ్యాఖ్యలు చేసింది. అయితే వెంటనే ఓ రిపోర్టర్.. ప్రశ్న వేస్తాడు. దీంతో వద్దులేండి.. ఏదో మొహమాటానికి అడిగినట్టు ఉందని అనేసింది చాందిని. ఇప్పటి వరకు జరిగిన ప్రెస్ మీట్ ఫేమస్ ఏం కాదు.. నువ్వు మాట్లాడిందే ట్రెండ్ అవుతుందని విశ్వక్ నవ్వుతూ అంటారు. ఏం పర్లేదులే అని చాందిని ముగించింది. మొత్తానికి చాందిని బాగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News