మ‌లేషియా మోడ‌ల్‌తో యువ‌హీరో డేటింగ్

వాలెంటైన్స్ డే 2024 రొమాంటిక్ డేట్ సందర్భంగా పాపుల‌ర్ యువ‌హీరో గుట్టు ర‌ట్ట‌యింది. అత‌డు మ‌రోసారి త‌న గాళ్ ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కాడు.

Update: 2024-02-17 04:25 GMT

వాలెంటైన్స్ డే 2024 రొమాంటిక్ డేట్ సందర్భంగా పాపుల‌ర్ యువ‌హీరో గుట్టు ర‌ట్ట‌యింది. అత‌డు మ‌రోసారి త‌న గాళ్ ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కాడు. చేయి చేయి క‌లిపి జంటగా షికార్ కి వెళుతున్న ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో సంచ‌ల‌నంగా మారాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం న‌డుస్తోంది? అన్న ఆరాలు వేడెక్కించేస్తున్నాయి. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో కెమెరాకి చిక్కిన యువ‌హీరో ఎవ‌రు? స‌ద‌రు మోడ‌ల్ ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.


బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ దూకుడు గురించి తెలిసిందే. కెరీర్ ఆరంభ‌మే వ‌రుస‌గా త‌న క‌థానాయిక‌ల‌తో డేటింగులు చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు ఈ చాక్లెట్ బోయ్. అన్న‌కు త‌గ్గ త‌మ్ముడిగా మ‌గువ‌ల గుండెల్లో ఆరాధ్యుడిగా మారాడు. అత‌డిని ప్రేమించేందుకు గాళ్స్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతుండ‌డం ఇప్పుడు హిందీ మీడియాలో చ‌ర్చ‌గా మారింది. కానీ అత‌డి ఎంపిక ఈసారి చాలా డిఫ‌రెంటుగా ఉంది. ఇషాన్ ఖతర్ గ‌త కొంత‌కాలంగా పాపుల‌ర్ మలేషియన్ మోడ‌ల్ చాందినీ బైంజ్‌తో డేటింగ్ చేస్తున్నాడ‌నే పుకార్ షికార్ చేస్తోంది. ఆ ఇద్ద‌రూ కలిసి ఫిబ్ర‌వ‌రి 14 -ప్రేమికుల రోజున డిన్న‌ర్ డేట్ కి వెళుతూ పట్టుబడ్డాడు. ముంబయిలోని ప్రముఖ ఫుడ్ డెస్టినేషన్ వ‌ద్ద‌ ఈ జంట చేయి చేయి ప‌ట్టుకుని ప్రేమగా ఒక‌రినొక‌రు చూసుకుంటూ నడుస్తూ వెళ్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో దీనిపై అద్భుత‌ స్పందనలు వ‌చ్చాయి. ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ పొగిడేస్తున్నారు కొంద‌రు.


అమ్మాయితో రొమాంటిక్ నైట్ అవుట్

సోష‌ల్ మీడియాలో లీకైన‌ వీడియోలో ఇషాన్ ఖట్టర్ తెల్లటి ప్యాంటు కాంబినేష‌న్ చారల చొక్కా ధరించి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తుండగా, అతడి భాగస్వామి చాందినీ కళ్లు చెదిరే మినీ డ్రెస్ లో మైమ‌రిపించింది. ఆసక్తికరంగా షాహిద్ కపూర్ - కృతి సెనన్ న‌టించిన `తేరీ బాటన్ మీ ఐసా ఉల్జా జియా` స్క్రీనింగ్ ఈవెంట్‌కు ఈ ఇద్దరూ జంట‌గా హాజర‌య్యారు. అప్ప‌టి నుంచి వీరి న‌డుమ‌ డిన్నర్ అవుట్‌టింగ్ ల గురించి నెటిజ‌నుల్లో చ‌ర్చ మొద‌లైంది. కుర్ర‌హీరో దూకుడుపై బోలెడంత చర్చ సాగుతోంది.


చాందినీ బైంజ్ సెప్టెంబర్ 2023లో ఇషాన్ ఖట్టర్‌తో మొదటిసారి కనిపించింది. అప్పటి నుండి మ‌లేషియ‌న్ మోడల్ చాందిని ముంబైలో అత‌డి ప్రేమ‌లో నిండా మునిగింద‌ని అంతా భావిస్తున్నారు. నిరంత‌రం హిందీ ఫిలిం స‌ర్కిల్స్ లో ఈ జంట ఓపెన్ గా షికార్లు చేయ‌డంతో డేటింగ్ అధికారికం అయింది. అయినా కానీ త‌మ‌పై గాసిప్ ల‌ను ఈ జంట ఖండించ‌ను లేదు. తమ సంబంధ స్థితి గురించి ఎప్పుడూ పెదవి విప్పనూ లేదు.

చాందినీ బైంజ్ ఎవరు?

చాందినీ బైంజ్ మలేషియాకు చెందిన ప్రఖ్యాత మోడల్. ప‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భారీ అభిమానుల ఫాలోయింగ్ ని క‌లిగి ఉంది. 22 ఏళ్ల ఈ బ్యూటీ సాధారణంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అత్యంత యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టాలో 143K మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రస్తుతం తన ప్రియుడు ఇషాన్ ఖట్టర్ స్వస్థలమైన ముంబైలో నివసిస్తోంది.

మోడలింగ్‌తో పాటు, చాందినీ తన కెరీర్‌లో అనేక ఈవెంట్‌లు షోలను హోస్ట్ చేసింది. ఇటీవల ఒక ప్రముఖ హెయిర్ కేర్ కంపెనీకి సంబంధించిన టీవీ ప్రకటనలో కూడా కనిపించింది. తన పాత ఇంటర్వ్యూలలో ఒకదానిలో హాలీవుడ్ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి కూడా మాట్లాడింది. చాందిని బైంజ్ త‌న ఫేవ‌రెట్ స్టార్ ప్రియాంక చోప్రా, త‌న‌ను ఆరాధిస్తాన‌ని వ్యాఖ్య‌నించింది.

Tags:    

Similar News