#NC23 సెట్లో చందూ మొండేటి బ‌ర్త్ డే వేడుక‌లు

26 సెప్టెంబ‌ర్ చందు మొండేటి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర‌బృందం సెట్లో బ‌ర్త్ డే వేడుక‌ల‌ను నిర్వ‌హించింది. ఆన్ లొకేష‌న్ చందూ కేక్ క‌ట్ చేసి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ జ‌రుపుకున్నారు.

Update: 2023-09-26 13:00 GMT

అక్కినేని నాగ చైతన్య క‌థానాయ‌కుడిగా చందూ మొండేటి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం NC23. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ ప‌తాకంపై బ‌న్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. 100 ప‌ర్సంట్ ల‌వ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన గీతా ఆర్ట్స్ లో ఇప్పుడు మ‌రోసారి నాగ‌చైత‌న్య ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఈ చిత్రంలో నాగ చైతన్య జాలరి పాత్రలో స‌ర్ ప్రైజ్ చేయ‌నున్నాడ‌నేది టాక్. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేయాల‌నేది ప్లాన్. నిజ ఘ‌టనల ఆధారంగా రూపొందించిన కథాంశంతో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే విధంగా ఉంటుంద‌ని స‌మాచారం. నాగ చైతన్య ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. కార్తికేయ‌- కార్తికేయ 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందించిన చందు మొండేటి ఈసారి భిన్న‌మైన జాన‌ర్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డ‌మే ధ్యేయంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

26 సెప్టెంబ‌ర్ చందు మొండేటి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర‌బృందం సెట్లో బ‌ర్త్ డే వేడుక‌ల‌ను నిర్వ‌హించింది. ఆన్ లొకేష‌న్ చందూ కేక్ క‌ట్ చేసి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ జ‌రుపుకున్నారు. బాస్ అల్లు అరవింద్ స‌హా బ‌న్ని వాసు త‌మ ద‌ర్శ‌కుడు చందూకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

క‌థాంశం ఇంట్రెస్టింగ్:

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం ఇంత‌కుముందు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కె మచ్చలేశం గ్రామానికి వెళ్ల‌గా.. అక్క‌డ‌ మత్స్యకారులు వారి కుటుంబాలతో వారి జీవనశైలి గురించి నాగ‌చైత‌న్య అడిగి తెలుసుకున్నారు. చాలా వ‌ర‌కూ తీర ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఈ సినిమా కథ యథార్థ ఘటనల స్పూర్తితో రూపొందిందని నాగ చైతన్య ఇప్ప‌టికే వెల్లడించాడు. 2018లో ఈ (మ‌చ్చ‌లేశం) గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. శ్రీ‌కాకుళం విలేజీతో పాటు ఏపీలోని మ‌త్స్య‌కార గ్రామాలు స‌హా పొరుగున ఉన్న తీర ప్రాంతాల్లోను చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నార‌ని తెలిసింది. ఈ చిత్రంలో అద్భుతమైన ప్రేమకథ ఉంటుంద‌ని తెలిసింది.

Tags:    

Similar News