చంద్రముఖి 2: తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే..

మొత్తం తెలుగు రాష్ట్రాలలో 10.10 కోట్ల బిజినెస్ ఈ చిత్రంపై జరిగింది. దీంతో తెలుగులో ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ రావాలంటే కచ్చితంగా 11 కోట్ల వరకు కలెక్షన్స్ రావాలి.

Update: 2023-09-28 04:16 GMT

లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మూవీ చంద్రముఖి 2. పి వాసు దర్శకత్వంలోనే ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై గ్రాండియర్ లో రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి సూపర్ హిట్ అయినా చంద్రముఖి అనే బ్రాండ్ కారణంగా ఈ చిత్రానికి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఇదే కాన్సెప్ట్ తో తెలుగులో విక్టరీ వెనకటేష్ హీరోగా పి వాసు నాగవల్లి పేరుతో మూవీ చేసి డిజాస్టర్ కొట్టారు.

మళ్ళీ సుదీర్ఘ గ్యాప్ తీసుకొని తమిళంలో చంద్రముఖి 2 తెరకెక్కించారు. మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. అలాగే ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. దీంతో సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత హైప్ క్రియేట్ చేసుకుంది. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ అయితే జరగలేదు కానీ సినిమా మీద కొంత పాజిటివ్ వైబ్ ఉంది.

తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూసుకుంటే నైజాంలో 3.50 కోట్ల వరకు జరిగింది. సీడెడ్ లో 2.1 కోట్లకి డీల్స్ సెట్ కాగా ఆంధ్రాలో 4.5 కోట్ల బిజినెస్ ని చంద్రముఖి 2 సొంతం చేసుకుంది. మొత్తం తెలుగు రాష్ట్రాలలో 10.10 కోట్ల బిజినెస్ ఈ చిత్రంపై జరిగింది. దీంతో తెలుగులో ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ రావాలంటే కచ్చితంగా 11 కోట్ల వరకు కలెక్షన్స్ రావాలి. డబ్బింగ్ సినిమాకి ఇదేమీ చిన్న టార్గెట్ అయితే కాదు.

కానీ ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే జైలర్ తరహాలో వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అందుకున్న ఆశ్చర్యం లేదు. అలాగే లారెన్స్ హర్రర్ జోనర్ చిత్రాలతో తెలుగులో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ కూడా ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. ఈ కారణంగా మూవీపై కొంత క్రేజ్ ఉంది. అయితే ఈ చిత్రానికి పోటీగా రామ్ పోతినేని స్కంద రిలీజ్ అయ్యింది.

స్కందకి పాజిటివ్ టాక్ వస్తే మరల చంద్రముఖికి బజ్ తగ్గే ఛాన్స్ ఉంది. ఈ ఈ రెండుంటిలో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విన్నర్ గా నిలబడుతుందనేది చూడాలి. చంద్రముఖి ఓవరాల్ గ 40 నుంచి 40 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News