డార్లింగ్ కి చరణ్ ఇంకా గుడ్ లక్ చెప్పలేదే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `దేవర` మొదటి భాగం ఈనెల 27న భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `దేవర` మొదటి భాగం ఈనెల 27న భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత రిలీజ్ అవుతోన్న సినిమా ఇది. దీంతో తారక్ అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. థియేటర్లో బొమ్మ ఎప్పుడు పడుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ అండ్ కో మీడియా ఇంటర్వ్యూల్లో చుట్టేస్తున్నారు.
తారక్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు. అయితే ఇంకా తారక్ క్లోజ్ ప్రెండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇంకా సీన్ లోకి రాలేదు. `దేవర` గురించి చరణ్ ఇంకా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. తారక్ కి ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. దీంతో చరణ్ ఇంకా స్పందించలేదు ఏంటి? అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. తారక్ ఈ సినిమా రిలీజ్ రోజు కూడా ఇండియాలో ఉండటం లేదు.
అబుదాబి కి ఐపా అవార్డుల వేడుకల కెళ్తున్నాడు. 27 నుంచి 29 వరకూ అక్కడే ఉంటాడు. ఇదే వేడుకలకు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరవుతున్నారు. బాలీవుడ్ నుంచి భారీ ఎత్తున సెలబ్రిటీలు వెళ్తున్నారు. మరి ఆ రోజు అందుబాటులో ఉండని చరణ్ స్నేహితుడుకి ఆల్ ది బెస్ట్ చెప్పకపోవడం ఏంటి? అసలేం జరుగుతోంది? అనే చర్చ జరుగుతోంది. అయినా రిలీజ్ కి ఇంకా పది రోజులకు పైగా సమయం ఉంది.
ఆల్ ది బెస్ట్ చెప్పడం ఏముంది? క్షణాల్లో పని ప్రపంచంలో ఎక్కడున్నా? ఎక్స్ లో ఓ పోస్ట్ పెడితే సరి. దానికి ఇంత రాద్దంతా ఇప్పటి నుంచే అవసరం లేదు. ఒకవేళ చరణ్ స్పందించకపోయినప్పుడు ఇలాంటి కథనాలకు తావు ఇవ్వాలి తప్ప! అప్పుడే ఎందుకు తొందర అంటూ తారక్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.