చరణ్-ఉపాసన మళ్లీ గుడ్ న్యూస్ !
లక్షలు పోసి ఓ కేర్ టేకర్ ని నియమించుకున్నా! క్లీంకార చుట్టూ ఎప్పుడు మామ్ కనిపిస్తూనే ఉంది. క్లీంకార ఇంకా నెలలు బేబినే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన జీవితాల్లోకి కొత్తగా క్లీంకార వచ్చిన సంగతి తెలిసిందే. ఆ దంపతు లిద్దరికీ క్లీంకార తొలి సంతానం కావడంతో ఆనందానికి అవదుల్లేవ్. ప్రస్తుతం తల్లిదండ్రులుగా క్లీంకార బేబి మూవ్ మెంట్స్ ని ఎంతో ఆస్వాదిస్తున్నారు. చరణ్ కి సమయం దొరికితే క్లీంకారతోనే ఆడుకుంటున్నాడు. ఇక ఉపాసన ఓవైపు అపోలా బాధ్యతలు నిర్వహిస్తూనే తల్లిగానూ తాను నిర్వర్తించాల్సిన అన్ని బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్నారు.
లక్షలు పోసి ఓ కేర్ టేకర్ ని నియమించుకున్నా! క్లీంకార చుట్టూ ఎప్పుడు మామ్ కనిపిస్తూనే ఉంది. క్లీంకార ఇంకా నెలలు బేబినే. ఇటీవలే ఉపాసన జన్మనిచ్చిన నేపథ్యంలో రెండవ బిడ్డకు ఎక్కువ గ్యాప్ తీసుకో వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఉపాసన మాత్రం ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. త్వరలోనే రెండవ బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్లు ఉపాసన రివీల్ చేసారు. `నేను ఆలస్యంగా పిల్లల్ని కనాలి అనుకున్నా.
అందుకే పెళ్లైన పదేళ్ల తర్వాత క్లీంకారకు జన్మనిచ్చా. పిల్లల కోసం ఎవరెంత పోరు పెట్టినా లెక్క చేయ లేదు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకేమీ బాధలేదు. అది పూర్తిగా నా ఇష్టం. ప్రస్తుతం నేను సెకెండ్ ప్రెగ్నెన్సీకి సిద్దంగా ఉన్నాను ` అన్నారు. తొలి సంతానం ఆలస్యమయ్యే సరికి ఎన్నో విమర్శలు ఎదుర్కున్నట్లు గతంలో ఉపాసన తెలిపిన సంగతి తెలిసిందే. పిల్లల్ని కావాలని ఆలస్యం చేస్తున్నారా? లేక ఇంకేదైనా కారణాలతో మాతృమూర్తి అనుభూతికి దూరంగా ఉంటున్నారా? అని రకరకాల సందేహాలు తెరపైకి వచ్చాయి.
అన్నింటికి క్లీంకార రాకతో పుల్ స్టాప్ పడింది. తాజాగా రెండవ బిడ్డని కనడానికి సిద్దంగా ఉన్నట్లు తెలప డంతో అభిమానులు మరింత సంతోషంలో మునిగిపోతున్నారు. ఈసారి ఇండస్ట్రీకి కాబోయే వారసుడు కావాలి? అంటూ అప్పుడే కోరికలు మొదలు పెట్టారు. మరి చరణ్ -దంపతుల మనసులో మాటేంటే? ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.