అంబానీ ఇంట సంబరంలో చరణ్-ఉపాసన
ఈ వేడక కోసం ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి భారత్ నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరవుతున్నారు.
అపరకుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జామ్ నగర్ లో ఒక రోజు ముందుగానే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్కడి గ్రామస్తులకు సంప్రదాయ గుజరాతీ వంటకాలు వడ్డించడంతోనే వేడుక మొదలైంది. ఇక అసలైన వేడుక నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ వేడక కోసం ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి భారత్ నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరవుతున్నారు.
పారిశ్రామిక వేత్తలు..సెలబ్రిటీలు..ప్రముఖ రాజకీయ నాయకులు అంతా ఇప్పటికే చేరుకున్నారు. మూడు రోజుల వేడుకల్లో అందర్నీ భాగం చేస్తూ అంబానీ అంబరాన్ని అంటేలా సంబరాలు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు ఎవరెవరు? హాజరవుతున్నారు అన్నది ఇంకా బయటకు రాలేదు. అయితే టాలీవుడ్ నుంచి మాత్రం ప్రీ వెడ్డింగ్ వేడులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు వెళ్తు న్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున జామ్‌నగర్ చేరుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే జామ్ నగర్ ఎయిర్ లైన్ అంతా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ప్లైట్ లు జామ్ నగర్ వైపు ప్రయాణం చేస్తున్నాయట. ఓవైపు విదేశాల నుంచి మరోవైపు భారత్ లో వివిధ ఎయిర్ పోర్టుల నుంచి ప్రత్యేక విమానాలు జామ్ నగర్ కి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ నుంచి చరణ్-ఉపాసన మాత్రమే హాజరవుతున్నారా? ఇంకా ఎవరికైనా ఆహ్వానం అందిందా? అన్నది తెలియాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వెళ్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఇంతవరకూ మళ్లీ ఎలాంటి వార్త రాలేదు. గురువారం సాయంత్రం జరిగిన వేడుకల్లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుటుంబం సందడి చేసినట్లు తెలుస్తోంది. ఎవర్‌ల్యాండ్‌లో `యాన్ ఈవినింగ్` అనే సంగీత ఫంక్షన్‌తో అసలైన వేడుక మొదలవుతుంది. మరుసటి రోజు జంగిల్ సఫారీ - ఫెయిర్ కూడా జరుగుతుంది. మూడవ రోజు రెండు అవుట్డోర్ ఈవెంట్లు ప్లాన్ చేసారు. ఈ వేడుకలన్నింటిలో అతిధులంతా పాల్గొనేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.