ఆసుపత్రిలో కమల్ హాసన్ సోదరుడు!
విశ్వనటుడు కమల్ హాసన్ సోదరుడు, నటి సుహాసిని తండ్రి చారు హాసన్(93) చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆసుపత్రి లో చేరారు
విశ్వనటుడు కమల్ హాసన్ సోదరుడు, నటి సుహాసిని తండ్రి చారు హాసన్(93) చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆసుపత్రి లో చేరారు. తండ్రితో ఆసుపత్రిలో కలిసి దిగిన ఓ ఫోటోని సుహాసిని తన ఇన్ స్టా పేజీలో పంచుకున్నారు. తన తండ్రి మెడికల్ వెకేషన్‌లో ఉన్నారని, డాక్టర్లు, నర్సులు, బిడ్డల సంరక్షణతో ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. చారుహాసన్ వృద్దాప్య సమస్యల కారణంగా ఆరోగ్య పరీక్షల నిమిత్తమే అక్కడ చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదంలో లేదని తెలుస్తోంది.
చారుహాసన్ జాతీయ అవార్డు పొందిన నటులు అన్న సంగతి తెలిసిందే. 1986 కన్నడ చిత్రం `తబరణ కథే` లో నటించి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించారు. `ఇన్‌స్పెక్టర్ రుద్ర`, `అంకురం`, `నిర్ణయం`, `మాతృ దేవో భవ`, `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, `వెంకీ మామ`, ` డియర్ కామ్రేడ్` వంటి చిత్రాల్లో నటించారు. ఆయన నటుడే కాదు. మంచి విలన్ కూడా.
మొత్తంగా ఆయన కెరీర్ లో ఇప్పటివరకూ 120కి పైగా సినిమాలు చేసారు. ఈ మధ్యనే తమళ్ లో `హరా` అనే సినిమా చేసారు. ఇది జూన్ లో రిలీజ్ అయింది. అలాగే చారుహాసన్ తమిళ్ లో న్యూ సంగమం, ఐపీసీ 215 సినిమాలు దర్శకుడిగా తెరకెక్కించారు. కమల్ హాసన్ సోదరుల్లో చారుహాసన్ పెద్దవారు. మధ్యలో చంద్రహాసన్ ఉండేవారు. ఆయన 2017 లో మరణించారు. కమల్ అందరిలో చిన్నవారు.
చారుహాసన్ కుమార్తె సుహాసిని. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 80-90 కాలంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన సుహాసిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. భర్త దర్శకుడు మణిరత్నంకు సుహాసినీని అతి పెద్దక్రిటిక్ గా భావిస్తారు. తన సినిమాలతో భార్యని మెప్పించడం కష్టమని అంటుంటారు.