కమల్ హాసన్ బాటలో నాగచైతన్య
ఆసక్తికరంగా నాగ చైతన్య తన అభిమానుల ఇళ్లను వ్యక్తిగతంగా సందర్శించి బహుమతి పెట్టెలను అందించాడు. అభిమానులతో ఈ ప్రత్యేక ఇంటరాక్షన్ వారికి మరపురాని అనుభూతిని అందించింది.
అక్కినేని హీరో నాగ చైతన్య ఓటీటీలో 'దూత' అనే వెబ్ సిరీస్‌తో అరంగేట్రం చేయబోతున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి శరద్ మరార్ నిర్మాత. ఈ సిరీస్ డిసెంబర్ 1 న విడుదల కానుంది. ప్రత్యేకమైన ప్రమోషనల్ స్ట్రాటజీతో చైతన్య అండ్ టీమ్ ప్రణాళికలను రచించింది. ఆసక్తికరంగా నాగ చైతన్య తన అభిమానుల ఇళ్లను వ్యక్తిగతంగా సందర్శించి బహుమతి పెట్టెలను అందించాడు. అభిమానులతో ఈ ప్రత్యేక ఇంటరాక్షన్ వారికి మరపురాని అనుభూతిని అందించింది.ముఖ్యంగా ఈ నెల 23న చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి స్పెషల్ ట్రీట్ ని చై ప్లాన్ చేసాడు.
'దూత' తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి.పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంతకుముందు, ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు దివంగత పునీత్ రాజ్‌కుమార్ కూడా ఈ ప్రచార వ్యూహాన్ని అనుసరించారు. వారు అభిమానులను ఆశ్చర్యపరిచారు. నాగ చైతన్య ఇప్పుడు సీనియర్ల బాటను అనుసరించాడు.
NC23 స్పెషల్:
ఈ నెల 23న నాగ చైతన్య పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతడి 23వ చిత్రం NC23 నిర్మాతలు ఒక రోజు ముందు పుట్టినరోజు ట్రీట్‌ను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఓ సర్ ప్రైజ్ రివీల్ కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పెంచనుంది. ''తన సిబ్బందిని, తన ప్రేమికురాలిని.. తన ప్రజలను ఎంకరేజ్ చేసేవాడు..తన జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా వెనుకాడడు'' ఇది సినిమాలోని చై పాత్రను వివరిస్తుంది.
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఎపిక్ లవ్ స్టోరీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కథలో సంగీతానికి స్కోప్ ఉన్నందున దేవీశ్రీని ఎంపిక చేసారని సమాచారం.