'మంజుమ్మెల్ బాయ్స్' దర్శకుడు బాలీవుడ్‌లోకి?

Update: 2024-07-17 15:30 GMT

మాలీవుడ్ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ 'మంజుమ్మెల్ బాయ్స్' సౌత్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డ‌మే గాక దేశ‌వ్యాప్తంగా ఇది అన్ని ప‌రిశ్ర‌మ‌ల్ని, ప్ర‌ముఖుల్ని ఆక‌ర్షించింది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు చిదంబ‌రం పేరు మార్మోగింది. ఇప్పుడు న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు చిదంబరం ఫాంటమ్ స్టూడియోస్‌తో కలిసి ఒక‌ కొత్త ప్రాజెక్ట్‌తో హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ మేర‌కు ఫాంటమ్ స్టూడియోస్ CEO సృష్టి బెహ్ల్ అధికారికంగా దీనిని ప్ర‌క‌టించారు. ఇప్పుడు తెర‌కెక్కించే సినిమా ద‌ర్శ‌కుడికి కొత్త జాన‌ర్ కాగా.. నిర్మాణ సంస్థ‌కు కూడా కొత్త పంథా సినిమా అవుతుంద‌ని తెలిసింది. ఇరువురికీ ఇది కీల‌క‌మైన ద‌శ కూడా.


ఫాంటమ్ స్టూడియోస్ CEO సృష్టి బెహ్ల్ మాట్లాడుతూ-''చిదంబరాన్ని ఫాంటమ్ కుటుంబానికి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. మేం ఎల్లప్పుడూ అత్యుత్తమ పనిని చేయడానికి దర్శకులకు సాధికారతనిచ్చే సృజనాత్మక-ఆధారిత సంస్థగా ఉన్నాము. భాష తో ప‌ని లేకుండా.. ఫిలింమేక‌ర్స్‌ని ఈ కొత్త ప్రపంచంలో స‌రికొత్త‌ కథనాలను రూపొందించడానికి విభిన్న ప్రాంతాల నుండి ప్ర‌తిభావంతుల‌ను హిందీ చిత్ర‌సీమ‌కు తీసుకురావాలని మేము భావిస్తున్నాము. చిదంబరం మాకు సహకరించడానికి ఆదర్శవంతమైన వ్యక్తి. అతడి ప్రత్యేక దృష్టి కథనాన్నిప్ర‌ద‌ర్శించే పరాక్రమం ఫాంటమ్ స్టూడియోస్‌లోని మా ఆలోచ‌న‌లు, సృజనాత్మక తత్వానికి సరిగ్గా సరిపోతాయి. ఆయన విజన్‌ని హిందీ ప్రేక్షకులకు అందించడానికి మేం సంతోషిస్తున్నాము'' అని అన్నారు.

చిదంబరం 'మంజుమ్మెల్ బాయ్స్'ని తెర‌కెక్కించిన విధానంపై దేశ‌వ్యాప్తంగా క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు కురిసాయి. ఇది విమర్శనాత్మకంగా అలాగే వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ చిత్రం రూ.20 కోట్లతో తెరకెక్కింది. లైఫ్ టైమ్‌లో రూ. 242.3 కోట్లు ఆర్జించి అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. 2018 త‌ర్వాత మ‌ల‌యాళంలో ఇలాంటి అరుదైన‌ రికార్డును నెల‌కొల్పిన సినిమా వేరొక‌టి లేదు.

హిందీ చిత్రసీమలో తన అరంగేట్రం గురించి మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు చిదంబరం ఇలా అన్నారు. ''హిందీ ప్రధాన స్రవంతి సినిమా వైపు అడుగు ముందుకు వేయడానికి అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మంజుమ్మెల్ బాయ్స్ ఎల్లప్పుడూ ప్రత్యేకమైన సినిమా .. నా మొదటి హిందీ చిత్రం కోసం ఫాంటమ్ స్టూడియోస్‌తో కలిసి పని చేయడాన్ని గొప్ప‌ గౌరవంగా భావిస్తున్నాను. ఇది కొత్త కథనాలను అన్వేషించడానికి , విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి ఒక అవకాశం. అదే సమయంలో నా పనిని నిర్వచించే ప‌ని చేస్తాన‌ని న‌మ్మ‌కంగా ఉన్నాను.. అని అన్నారు. హిందీ సినీరంగంలో చెరగని ముద్ర వేయడానికి ఈ కాంబినేష‌న్ సిద్ధ‌మ‌వుతోంది. హిందీ ప్ర‌జ‌లు కళాఖండాన్ని ఆవిష్కరిస్తారని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News