ఆసుపత్రి నుంచి ఇంటికి చేతుల్లోనే మోసుకొచ్చాం!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ అంటే? అందరికీ తెలిసింది కొంతమందే. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, తోబుట్టువులు వాళ్ల పిల్లలు, మనవలు మాత్రమే.;
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ అంటే? అందరికీ తెలిసింది కొంతమందే. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, తోబుట్టువులు వాళ్ల పిల్లలు, మనవలు మాత్రమే. కానీ చిరంజీవి తల్లిదండ్రులకు మరో ముగ్గురు సంతానం కూడా కలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి రివీల్ చేసారు. అయితే ఆ ముగ్గురు కూడా రకరకాల కారణాలతో చిన్న వయసులోనే చనిపోయినట్లు చిరంజీవి తెలిపారు.
చిరంజీవి ఆరవ తరగతి చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఓ విషాధ ఘటన గుర్తు చేసుకున్నారు. 'నాన్న ఉద్యోగరీత్యా బిజీగా ఉండటంతో ఇంట్లోఅమ్మకు నేను సహాయం చేసేవాడిని. అన్ని పనుల్లోనూ నేను ముందుండే వాడిని. నేను ఆరవ తరగతి చదువుకుంటోన్న సమయంలో రమ అనే సోదరి అనారోగ్యానికి గురైంది. దీంతో అమ్మతో కలిసి ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ రెండు రోజుల తర్వాత చనిపోయింది.
దీంతో రమని చేతుల్లో మోసుకునే ఇంటికి తీసుకొచ్చాం. ఇంటి చుట్టు పక్కల వారు సహాయం చేయడంతో మిగతా కార్యక్రమాలు పూర్తిచేసాం. ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా నాన్నకు ఈ విషయం తెలిసింది. కానీ ఆయన వచ్చేసరికి అంతా జరిగిపోయింది. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంద`న్నారు. అలాగే చిరంజీవి చిన్న వయసులో తప్పిపోయిన ఘటన కూడా గుర్తు చేసుకున్నారు.
`చిన్న వయసులో ఆడుకుంటూ రోడ్డు మీదకు వచ్చేసాను. కానీ అక్కడ నుంచి ఎటువైపు వెళ్లాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాను. అక్కడ ఉన్న ఓ పెద్దాయన నన్ను చూసి కొలిమి దగ్గరకు తీసుకెళ్లారు. ఇంట్లో వాళ్లకు విషయం తెలిసింది. అమ్మ అక్కడికి వచ్చే సరికి ఒళ్లంతా మసి పూసుకుని కూర్చున్నా. నన్ను అలా చూసి వీడు మా అబ్బాయి కాదని చెప్పంది. కానీ తనకే మళ్లీ అనుమానం వచ్చి దగ్గరగా చూసి గుర్తు పట్టిందట.