చిరుతో బన్నీ పిల్లలు.. ఏం లేనట్టు ఉందే!

సినిమా సెలబ్రిటీలకే కాదు.. వాళ్ల పిల్లలకు కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-08-16 03:43 GMT

సినిమా సెలబ్రిటీలకే కాదు.. వాళ్ల పిల్లలకు కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటారు. స్టార్ కిడ్స్ లా కాకుండా నార్మల్ పిల్లల్లా బిహేవ్ చేస్తూ.. అందరి దృష్టిలో పడుతుంటారు. బన్నీ గారాలపట్టి అర్హ తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం మూవీలో భరతుడు రోల్ చేసి ఫిదా చేసింది. తన నటనతో సినీ ప్రియులను అలరించింది చిన్నారి.

ఇక అయాన్ కు అయితే స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తన క్రేజీ థింగ్స్ తో నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాడు. తన చిన్న చిన్న చిలిపి పనులతో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇటీవల తన తాతయ్య, సినీ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి క్రికెట్ ఆడి వైరల్ గా నిలిచాడు. తాత బౌలింగ్ లో షాట్లతో అదరగొట్టాడు అయాన్. అలా ఎప్పటికప్పుడు తన పిల్లలకు చెందిన వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి. అవి ఫుల్ ట్రెండ్ అవుతుంటాయి.


తాజాగా అయాన్, అర్హ మరోసారి సందడి చేశారు. తమ తాతయ్యతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వచ్చారు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న బ్లడ్ బ్యాంక్ వద్ద చిరంజీవి ఏటా లాగే ఈసారి కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గురువారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ కూడా వచ్చారు. తన మనవడు, మనవరాలిని తీసుకొచ్చారు.

ఆ సమయంలో చిరంజీవి పక్కనే అయాన్, అర్హ సందడి చేశారు. వారితో పాటు మెగాస్టార్ మనవరాళ్లు కూడా ఉన్నారు. మొత్తానికి చిరంజీవి పక్కనే బన్నీ పిల్లలు ఉన్న క్లిప్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నైస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వైట్ ఔట్ ఫిట్ లో అర్హ చాలా క్యూట్ గా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఇటీవల మెగా, అల్లు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుందన్నట్లు వస్తున్న వార్తలను కూడా కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం, బన్నీ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేయడం, నాగబాబు ట్వీట్ పెట్టి అకౌంట్ డీయాక్టివేట్ చేయడం, మళ్లీ యాక్టివేట్ చేయడం.. ఇవన్నీ తెలిసిందే. ఆ తర్వాత మెగా సెలబ్రేషన్స్ కు బన్నీ హాజరుకాకపోవడం, పవన్ ను విష్ చేయకపోవడం జరిగాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోస్ చూసి.. రెండు ఫ్యామిలీల మధ్య వైరం ఏం లేనట్టు ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి చూడాలి ఏం జరిగిందో.

Tags:    

Similar News