మెగాస్టార్.. కాస్త జాగ్రత్తగా..

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు ఐదు డిఫరెంట్ సినిమాలు చేశారు.

Update: 2024-06-27 14:30 GMT

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు ఐదు డిఫరెంట్ సినిమాలు చేశారు. అందులో ఒక్క వాల్తేరు వీరయ్య మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మిగిలిన సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో మెప్పించలేదు. మెగాస్టార్ నుంచి చివరిగా వచ్చిన భోళా శంకర్ అయితే చిరంజీవి కెరీర్ లో టాప్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా మరీ ఆ స్థాయిలో ఫ్లాప్ అవుతుందని ఎవరు ఊహించలేదు.

అయితే ఇకపై కథల ఎంపికలో మెగాస్టార్ చిరంజీవి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచి మారిన నేపథ్యంలో పంక్తు కమర్షియల్ కాకుండా బలమైన కథ, కథనాలతో పాటు సూపర్ ఫిక్షనల్ కాన్సెప్ట్ లతో మూవీస్ చేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు.

ఈ సినిమా సూపర్ ఫిక్షనల్ జోనర్ లోనే సోషియో ఫాంటసీ కథాంశంతో ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ త్రిష ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. అలాగే మరో నలుగురు హీరోయిన్స్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమాల గురించి అప్పుడే చర్చ మొదలైంది. చిరంజీవి కూడా సెలక్టివ్ గా కథలు ఎంచుకోవాలని భావిస్తున్నారు. అలాగే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో కొత్త ఐడియాస్ తో మూవీస్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం చిరంజీవి ఇప్పటికే దర్శకులని పిలిపించుకొని కథలు వింటున్నారంట. వారిలో ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ గా ఓ కథని ఆ దర్శకుడు చిరంజీవికి చెప్పారంట. ఆ కథ మెగాస్టార్ కి నచ్చిందని టాక్.

Read more!

అలాగే మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. ఆయన కూడా చిరంజీవిని దృష్టిలో ఉంచుకొని ఓ కథని సిద్ధం చేసారంట. వీరితో పాటు కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ పేరు కూడా చిరంజీవి నెక్స్ట్ దర్శకుల జాబితాలో వినిపిస్తోంది. కమర్షియల్ కథలైనా తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఎంటర్టైన్మెంట్ జోడి చెప్పడం హరీష్ స్టైల్. చేసినవి తక్కువే అయిన సక్సెస్ లు ఎక్కువ అందుకున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. మరి మెగాస్టార్ తో ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News