'ఇంద్ర' రీ-రిలీజ్ పై మెగాస్టార్ మ‌న‌సులో మాట‌!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ స‌క్సెస్ పుల్ చిత్రాల్లో 'ఇంద్ర' ఒక‌టి. 'ఇంద్ర' చిరంజీవికి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్రం

Update: 2024-08-20 11:32 GMT

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ స‌క్సెస్ పుల్ చిత్రాల్లో 'ఇంద్ర' ఒక‌టి. 'ఇంద్ర' చిరంజీవికి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన చిత్రం. అప్ప‌టి వ‌ర‌కూ సీమ బ్యాక్ డ్రాప్ స్టోరీలంటే న‌ట‌సింహ బాల‌కృష్ణ మాత్ర‌మే చేసేవారు. ఇంద్ర నుంచి మెగాస్టార్ లో కొత్త కోణం బ‌య‌ట ప‌డింది. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమా అప్ప‌ట్లో భారీ వ‌సూళ్ల‌ను సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పింది.

తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న గ్రాండ్ గా రీ-రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిరు బ‌ర్త్ డేకి ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉంది. దీంతో నెట్టింట 'ఇంద్ర' రీ-రిలీజ్ హ‌డావుడి మొద‌లైంది. మెగా అభిమానులు ఆ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా చిరంజీవి ఓ ప్ర‌త్యేక వీడియో రిలీజ్ చేసారు. 'ఇంద్ర‌సేనా రెడ్డి అని అంటుంటే ఒళ్లు గ‌గుర్లు పొడుస్తుంది.

రొమాలు నిక్క‌బొడుచుకుంటాయి. ఆ సినిమాకి ఉన్న ప‌వ‌ర్ అలాంటింది. ఇంద్ర అంత పెద్ద స‌క్సెస్ అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆ సినిమా క‌థ‌. అలాగే ఆ చిత్రం కోసం ప‌నిచేసిన వారంతా మ‌న‌సు పెట్టి శ్ర‌ద్ద‌గా ప‌నిచేసారు. అందుకే ఇప్ప‌టికీ ఇంద్ర‌కు సంబంధించి ప్ర‌తీ విష‌యాన్ని అంద‌రూ గుర్తు పెట్టుకున్నారు. ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏసీన్ నుంచి చూడ‌టం మొద‌లు పెట్టినా చివ‌రి వ‌ర‌కూ చూస్తాం.

అదే ఆ క‌థ గొప్ప‌త‌నం. నా సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువ‌లున్న ఉత్త‌మ క‌మ‌ర్శియ‌ల్ చిత్రం ఇంద్ర‌. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. క‌థ‌, క‌థ‌నం, న‌టీన‌టులు న‌ట‌న , పాట‌లు ప్ర‌తీది అద్భుతం. సినిమాలో తీసేయ‌డానికి అంటూ ఏదీ ఉండ‌దు. ఒక్క మాట‌లో చెప్పాలంటే క‌మ‌ర్శియ‌ల్ చిత్రానికి క‌చ్చిత‌మైన ఉదాహ‌ర‌ణ. బిగోపాల్ దీన్ని గొప్ప‌గా తెర‌కెక్కించారు.

ఈసినిమాలో ప‌నిచేసిన వారంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు. 22 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇప్పుడు రీ-రిలీజ్ అవ్వ‌డం నాకెంతో సంతోషంగా ఉంది .2002 జులై 22 ఇంద్ర రిలీజ్ అయింది. అప్పుడు ఎలాంటి భావోద్వేగానికి గుర‌య్యానో? ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఈ త‌రం వాళ్ల‌కు ఇంద్ర‌ని బిగ్ స్క్రీన్ పై చూపించాల‌నే ఆలోచ‌న వ‌చ్చిన స్వ‌ప్నాద‌త్..ప్రియాంక ద‌త్ ల‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నా. అంద‌రూ ఎంజాయ్ చేయండి ' అని అన్నారు.

Tags:    

Similar News