తనయుడు కోసం తండ్రి త్యాగం అంత ఈజీనా?
మరి ఇద్దరి మధ్య అంత పోటీ నడుమ చిరంజీవి తనయుడు కోసం ఓ కథనే త్యాగం చేస్తారు? అంటే నమ్మోచ్చా అంటే సమాధానం కష్టమైనదే.
తండ్రి-కొడుకులు చిరంజీవి-రామ్ చరణ్ మధ్య మంచి పోటీ ఉంటుందన్నది తెలిసిందే. 'నీ బాబు నా రా నేను అని చిరంజీవి అంటే...నీ కొడుకును డాడీ తగ్గను' అని చరణ్ అంటాడు. దానికి చిరంజీవి సర్లే మాటలెందుకు..సెట్స్ లో ..కెమెరా ముందు చూసుకుందాం అంటారు. అలా తండ్రీ-కుమారులిద్దరి మధ్య మంచి పోటీ ఉంది. మరి ఇద్దరి మధ్య అంత పోటీ నడుమ చిరంజీవి తనయుడు కోసం ఓ కథనే త్యాగం చేస్తారు? అంటే నమ్మోచ్చా అంటే సమాధానం కష్టమైనదే.
ఇంతకీ ఈ టాపిక్ ఇప్పుడు దేనికంటారా? అయితే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అతడితో పాతాళభైరవి లాంటి మాయలు మంత్రాలు ఉన్న సోషియా ఫాంటసీ సినిమా చేయాలని ఉందని `మహానటి` సమయంలో చిరు అన్నారు. దానికి నాగ్ అశ్విన్ కూడా రెడీ అయ్యారు. కొంత కథ కూడా రెడీగానే ఉంది.
అయితే ఇప్పుడీ కథ చిరంజీవి నుంచి చరణ్ కి వెళ్తుంది? అనే కొత్త ప్రచారం మొదలైంది. మరి అందుకు ఆస్కారం ఉందా? అన్నది చూడాలి. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` అనే సోషియా ఫాంటసీ సినిమా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా. ఈ నేపథ్యంలో మళ్లీ సోషియా ఫాంటసీ చిత్రాన్ని చిరంజీవి చేసే అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కథని తనయుడు రామ్ చరణ్ తో తెరకెక్కించేలా ప్లాన్ చేసే ఛాన్స్ ఉందన్న వార్త వినిపిస్తుంది.
ఇంతవరకూ చరణ్ సోషియా ఫాంటసీ టచ్ చేసింది లేదు. కాబట్టి నాగ్ అశ్విన్ ని ఒప్పిస్తే సరి లాక్ అయినట్లే అన్న వాదన వినిపిస్తుంది. అయితే నాగ్ అశ్విన్ ని చిరంజీవి అంత ఈజీగా వదులుతారా? అన్నది లైట్ తీసుకోవడానికి లేదు. చిరంజీవి తొలి పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి అంతగా కనెక్ట్ కాలేదు. ఇప్పుడా ఆయన ముందు పాన్ ఇండియా టార్గెట్ ఒకటుంది. `విశ్వంభర` ఆ అంచనాలు అందుకుంటుందా? లేదా? అన్నది జనవరిలో తేలుతుంది. కానీ నాగ్ అశ్విన్ తో పాతాళ భైరవి లాంటి సినిమా చిరంజీవి పాన్ ఇండియాలో చేస్తే అది వేరే లెవల్లో ఉంటుంది. చిరంజీవి పాన్ ఇండియా ఇమేజ్ కి తిరుగుండదు. పైగా రిటైర్మెంట్ తీసుకునే సమయంలో అలాంటి సినిమా చేస్తే చరిత్రలో పేరు మరింత బలంగా నాటుకుపోతుంది.