మరీ ఇంత యాక్షన్‌ అవసరమా చిరు అన్నయ్య..?

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసు కు దగ్గర్లో ఉన్నారు. అయినా కూడా ఆయన ఎనర్జీ మరియు ఆయనలో ఉండే ఉత్సాహం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.

Update: 2024-04-16 06:45 GMT

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసు కు దగ్గర్లో ఉన్నారు. అయినా కూడా ఆయన ఎనర్జీ మరియు ఆయనలో ఉండే ఉత్సాహం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. యంగ్ హీరోలకు ఏమాత్రం తీసి పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంతో పాటు, ఆ సినిమాల కోసం యంగ్‌ హీరోల కంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నాడు.

కాస్త కష్టమైన డాన్స్ మూమెంట్స్ నే బాడీ డబుల్‌ లేదా రోప్స్‌ టెక్నాలజీని యంగ్‌ హీరోలు ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఏడు పదుల వయసుకు చేరువ అయిన మెగాస్టార్‌ చిరంజీవి భారీ యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాడీ డబుల్‌ కు అస్సలు ఓకే చెప్పడం లేదు.

ఎంతటి రిస్కీ సన్నివేశాలు అయినా, ఎంత ఎత్తు నుంచి దూకే సన్నివేశాలు అయినా కూడా నేను సిద్ధం అన్నట్టుగా ముందుకు దూకేస్తున్నాడట. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర సినిమాను చేస్తున్నాడు. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చిరంజీవి చేసే యాక్షన్‌ చూసి యూనిట్‌ సభ్యులు షాక్ అవుతున్నారట.

దర్శకుడు మరియు ఫైట్‌ మాస్టర్స్ ఎంతగా రిక్వెస్ట్‌ చేసినా కూడా స్వయంగా యాక్షన్‌ సన్నివేశాలను చేస్తున్నాడట. మినిమం జాగ్రత్తలు తీసుకుంటూ చిరంజీవి విశ్వంభర సినిమా కోసం రౌడీలను చితకబాదేస్తున్నారట.

ఆ మధ్య మడ్‌ లో ఒక భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో కూడా చిరంజీవి బాడీ డబుల్‌ కి దర్శకుడు ప్లాన్‌ చేశాడట. కానీ చిరంజీవి మాత్రం అందుకు ఒప్పుకోలేదట. తానే స్వయంగా రోజులో 10 గంటలకు పైగా బుదరలో ఉండి షూట్‌ లో పాల్గొన్నాడట.

మొత్తానికి చిరంజీవి కమిట్‌మెంట్‌ ను చూసి ఆయన అభిమానులు హ్యాట్సాఫ్‌ అంటూనే మరో వైపు మరీ ఇంత కష్టమైన యాక్షన్‌ సన్నివేశాలను ఓన్‌ గా చేయడం అవసరమా అన్నయ్య అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇక చిరుకు చెల్లెల్లు పాత్రల్లో పలువురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. 2025 సంక్రాంతికి విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags:    

Similar News