స్టేషన్లో చియాన్ విక్రమ్ జులుం.. భయపడిన పోలీస్!
విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించే తమిళ విలక్షణ హీరో చియాన్ విక్రమ్.
విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించే తమిళ విలక్షణ హీరో చియాన్ విక్రమ్. ఆయన నటించే ప్రతి తమిళ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. అయితే ఆయన ప్రస్తుతం ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది మూవీటీమ్. ఇది ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా మాస్‌గా కనిపిస్తూ అలరిస్తోంది.
వివరాళ్లోకి వెళితే.. ఎలాంటి పాత్రనైనా కొత్తగా, ప్రేక్షకులను కట్టిపడేసేలా చేసే అద్భుతమైన నటుల్లో విక్రమ్ ఒకరు. పితామగన్, సామి, అపరిచితుడు లాంటి భారీ విజయాలను అందుకున్న ఆయనకు.. ప్రస్తుతం భారీ హిట్లు పడట్లేదు. అయినా ఆయన నుంచి పెద్ద సినిమాలే వస్తున్నాయి. త్వరలోనే ఆయన కబాలి దర్శకుడు పా.రంజిత్‌తో చేసిన తంగలాన్ చిత్రంతో వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
దీంతో పాటే విక్రమ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. విక్రమ్ 62వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. రూరల్ డ్రామాగా ఇది రానున్నట్లు తెలుస్తోంది. ఓ పోలీస్ స్టేషన్లోకి ఒక మహిళ తనను ఇద్దరు రౌడీలు అల్లరి చేశారని కంప్లైంట్ చేయడానికి వస్తుంది. అప్పుడు స్టేషన్లో అధికారులు ఎవరి పనిలో వారు ఉంటారు. ఈ లోగా ఓ ఇద్దరూ దెబ్బలు తింటూ వచ్చి పోలీస్ స్టేషన్లోకి పడతారు. వాళ్లను హీరో చియాన్ విక్రమ్ కొట్టుకుంటూ తీసుకొస్తారు.
దీంతో స్టేషన్లో గందరగోళ వాతావరణం క్రియేట్ అవుతుంది. జులుం చూపించిన హీరోను ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. అప్పుడు ఓ పోలీసుకు తన గురించి చెవిలో ఏదో చెబుతాడు హీరో. అప్పుడా పోలీస్ భయపడతాడు. మరీ ఇంతకీ హీరో ఏం చెప్పాడు? అతడి నేపథ్యం ఏంటన్నదే ఈ కథలా తెలుస్తోంది. ఇకత చివర్లో జాతరలో ఒక మామూలు స్కూటర్ మీద మార్కెట్ వస్తువులు తీసుకెళ్తూ కనిపించాడు హీరో. మొత్తంగా టీజర్ రొటీన్‌కు భిన్నంగానే కనిపించింది. డిఫరెంట్ ఎంటర్టైనర్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించింది.
కాగా, రీసెంట్గా అరుణ్ కుమార్.. సిద్దార్థ్‌తో చిత్తా అనే సినిమా తీసి మంచి హిట్ అందుకున్నారు.