జానీ మాస్టర్ ఎక్కడున్నారు?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Update: 2024-09-18 07:35 GMT

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అనంతరం అక్కడ పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు పోలీసులు.. జానీ మాస్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.. అదే సమయంలో ఆయన హైదరాబాద్ లో లేరని టాక్ వినిపిస్తోంది. ఎవరితో టచ్ లో కూడా లేరని, కాంటాక్ట్ చేస్తున్నా ఫోన్ కలవడం లేదని సమాచారం. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నార్సింగి పోలీసులు.. తాజాగా నెల్లూరు పోలీసులను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసులు.. జానీ మాస్టర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

అయితే జానీ మాస్టర్ సొంతూరు నెల్లూరే. దీంతో అక్కడ తన బంధువుల ఇళ్లలో ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. 2018లో ఏర్పాటు చేసిన హెరాస్‌ మెంట్‌ రెడ్రెసెల్‌ ప్యానల్‌.. విచారణ జరుపుతోంది. ఆ ప్యానల్ కు చైర్ పర్సన్ గా నటి ఝాన్సీ వ్యవహరిస్తున్నారు.

రీసెంట్ గా మీడియాతో కూడా మాట్లాడారు ఝాన్సీ బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించిందని చెప్పారు. ఆ తర్వాత మీడియా ఘటనను తమ దృష్టికి తీసుకొచ్చిందని తెలిపారు. వర్క్ ప్లేస్ లో వేధింపులు ఉన్నాయంటూ మొదట ఆ అమ్మాయి ఆశ్రయించిందని, ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయట పెట్టిందని వెల్లడించారు. ప్రస్తుతం లీగల్‌ గా విచారణ జరుగుతోందని తెలిపారు ఝాన్సీ.

అయితే వేధింపులు ఎదుర్కొనే సమయంలో బాధితురాలు మైనర్ అని ఝాన్సీ తెలిపారు. ఆమెకు న్యాయం కచ్చితంగా అవసరమని చెప్పారు. మరో మూడు నెలల్లో వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్‌ చేస్తామని వెల్లడించారు. తమ పరిధికు చెందిన విచారణ పూర్తి చేసేశామని తెలిపారు. కాగా, అమ్మాయిలు ఎవరైనా కంప్లైంట్‌ చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కానీ బాధితురాలు ఈమేనని పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News