ఏకాగ్రత కోసం పక్క సీట్లు కొనేసి సినిమా చూస్తాడు ఆయన
సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె. నాయుడు గురించి పరిచయం అవసరం లేదు. చాలా సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు.
సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె. నాయుడు గురించి పరిచయం అవసరం లేదు. చాలా సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. ఇండస్ట్రీలో బెస్ట్ టెక్నీషియన్ గా మంచి పేరుంది. అలాగే స్టైలిష్ కెమెరా మ్యాన్ గానూ ఛోటాకె. ను పిలుచుకుంటారు. ప్రస్తుతం ఉన్న బిజీ సినిమాటోగ్రాఫర్స్ లో ఆయన ఒకరు. ఎలాంటి లోకేషన్లు అయినా అద్భుతంగా చూపించగల దిట్ట. మరి సినిమాల విషయంలో ఛోటా.కె ఎనాలసిస్ ఎలా ఉంటుందంటే? ఆయన నుంచి ఆసక్తికర విషయాలే తెలుస్తున్నాయి.
సాధారణంగా థియేటర్లో అందరితో కలిసి సినిమా చూస్తుంటారు. దీంతో థియేటర్లో బోలెడంతం హడావుడి ఉంటుంది. విజిల్స్ హడావుడి మామూలుగా ఉండదు. సగటు ప్రేక్షకుడు ఆ రకంగా సినిమాని ఎంజాయ్ చేస్తాడు. కానీ ఛోటా.కె. సినిమా చూసే విధానం మాత్రం పూర్తి భిన్నమని తెలుస్తోంది. ఆయన సినిమా చూడాలంటే ఆ యన పక్క సీట్లలో..వెనుక ...ముందు సీట్లలో ఎవరూ ఉండకూడదట.
ఎలాంటి డిస్టబెన్స్ అస్సలు ఉండకూడదట. అందుకే ఛోటాకె సినిమాకెళ్తే ఆ చుట్టు పక్కల సీట్లు అన్ని కొనేస్తాడుట. అటుపై సింగిల్ గా కూర్చుని సినిమా ఆస్వాదిస్తాడు. ఇదంతా కేవలం ఏకాగ్రత కోసమే అలా చేస్తారుట. అలాగే ఆసమయంలో స్నేహితులు ఎవరైనా ఉంటారా? అంటే వాళ్లను అస్సలు థియేటర్ కి తీసుకెళ్లారుట. ఆయన ఏ సినిమా చూడాలన్న సింగిల్ గానే వెళ్తారుట.
ఇలా చేయడం వల్ల తనకి ఎంతో ఉపయోగం ఉందంటున్నారు. సినిమా బాగా విశ్లేషించడానికి..కెమెరా పనితనం ఎలా ఉండో అర్దం చేసుకోవడానికి తప్పులు ఏవైనా ఉంటేమళ్లీ పునరావృతం కాకుండా చేసుకోవ డానికి ఇలాంటి వీక్షణలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. అలాగే ఆధునిక సాంకేతికత ..హంగులు ..సామాగ్రిపై కూడా పెద్దగా నమ్మకం పెట్టరుట. వీటి వెనుక ఉన్నది మనిషే కాబట్టి ఆ పనిచేసే మనిషిని బట్టే ఔట్ ఫుట్ ఎలా వస్తుందో చెప్పొచ్చు అన్నారు. 5డీ అయినా..అలెక్సా అయినా..సెల్ ఫోన్ లో షూట్ చేయమన్నా షూట్ చేస్తానని` అన్నారు.