సప్తగిరి ఏమయ్యాడు..?

సప్తగిరి కూడా అంతే.. తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చేస్తూ వచ్చాడు.

Update: 2024-09-19 20:30 GMT

తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో మెప్పిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు సప్తగిరి. బొమ్మరిల్లు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ అందులో చిన్న క్యామియో ఇచ్చిన సప్తగిరి దేశముదురు లో కూడా నటించాడు. ఐతే అల్లు అర్జున్ పరుగు సినిమాలో మాత్రం సప్తగిరి పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమాతో సప్తగిరి ఫేట్ మారిపోయింది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయితే చాలు కమెడియన్ గా తెలుగు పరిశ్రమలో మంచి పాపులారిటీ సంపాదించే ఛాన్స్ ఉంటుంది.

సప్తగిరి కూడా అంతే.. తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చేస్తూ వచ్చాడు. సప్తగిరి కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ప్రేమ కథా చిత్రం. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో సప్తగిరి కామెడీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. అందులో దెయ్యంతో సప్తగిరి అక్క మళ్లొచ్చావా అక్కా అంటూ సాగే ఎపిసోడ్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. రాజు గారి గది సినిమాలో కూడా సప్తగిరి కామెడీ అదరగొట్టేసింది. ఇక కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించాక లీడ్ రోల్ కూడా చేయాలని ప్రోత్సాహం రావడంతో ఆ ప్రయత్నాలు కూడా చేశాడు సప్తగిరి.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ అని తన నాన్ స్టాప్ కామెడీ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు సప్తగిరి. ఆ తర్వాత సప్తగిరి L.L.B, వజ్రకవచదర గోవిందా సినిమాలు కూడా సప్తగిరి లీడ్ రోల్ లో చేసి మెప్పించాడు. ఈమధ్య బిగ్ బాస్ విన్నర్ సన్నీతో కలిసి అన్ స్టాపబుల్ సినిమాలో నటించాడు. ఐతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ తన కామెడీతో అలరిస్తూ వస్తున్న సప్తగిరికి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవని చెప్పొచ్చు.

ఈమధ్య యువ కమెడియన్స్ కూడా అదరగొడుతుండగా తన కామెడీతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకున్న సప్తగిరికి కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. కమెడియన్ గానే కాదు లీడ్ రోల్ చేసిన సినిమాలతో కూడా మంచి మార్కెట్ సంపాదించిన సప్తగిరికి ఈమధ్య అవకాశాలు తగ్గాయి. ఐతే లీడ్ రోల్ చేస్తున్నాడు కదా అని కామెడీ రోల్స్ చేయడని కాదు. తనకు సినిమాలో ఎలాంటి అవకాశం ఇచ్చినా చేస్తానని అంటున్నాడు సప్తగిరి. ఐతే సప్తగిరికి మళ్లీ ఒక మంచి కామెడీ ట్రాక్ ఉన్న సినిమా పడితే తిరిగి ఫాంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సప్తగిరి కామెడీ మిస్ అవుతున్న ఆయన ఫ్యాన్స్ అంతా ఆయన వరుస సినిమాలు చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News