యాక్షన్ మేకర్ కామెడీ లోకి దిగాడేంటి?
'ఖాకీ'..'వలిమై'..'తనివు' లాంటి యాక్షన్ హిట్ చిత్రాలతో ఫేమస్ అయిన స్టార్ మేకర్ హెచ్. వినోధ్ గురించి చెప్పాల్సిన పనిలేదు
'ఖాకీ'..'వలిమై'..'తనివు' లాంటి యాక్షన్ హిట్ చిత్రాలతో ఫేమస్ అయిన స్టార్ మేకర్ హెచ్. వినోధ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన జర్నీ మొదలు పెట్టడమే యాక్షన్ చిత్రాలతో ఆరంభమైంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్లు మీద హిట్లు కొడుతు ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వనటుడు కమల్ హాసన్ సైతం అవకాశం కల్పించాడు. ఈ ప్రాజెక్ట్ ని స్వయంగా కమల్ హాసన్ సొంత బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అలాగే 'కాఖీ' చిత్రానికి సీక్వెల్ కూడా చేస్తున్నట్లు ఈ మధ్యనే అధికారికంగానూ ప్రకటించారు. ఇలా ఇంత బిజీగా ఉన్న దర్శకుడు కామెడీ హీరోతో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. యోగిబాబు తో పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడుట వినోధ్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం. మరి సడెన్ గా దర్శకుడు ఇలాంటి టర్నింగ్ తీసుకోవడం ఏంటి? అని సందేహం రావడం సహజం.
అయితే కమల్ ..కార్తీ ఇద్దరు వారు ముందుగా కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటంతోనే వినోద్ ఈ గ్యాప్ లో కామెడీ సినిమా వైపు వెళ్తున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ విజయం తర్వాత కమల్ వరుసగా సినిమాలు ప్రకటిస్తూ బిజీ అవుతున్నారు. అవి పూర్తి చేయకుండానే కొత్త ప్రాజెక్ట్ ల్లో ఆయన పేరు వినిపిస్తుంది. అలాగే సొంత బ్యానర్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలా రెండు పనులతో కమల్ క్షణం తీరిక లేకుండా గడుపుతు న్నారు.
అటు కార్తీ కూడా ఇప్పటికే పలువురు దర్శకులు డేట్లు కేటాయించాడు. ఇప్పటికిప్పుడు కాఖీ సీక్వెల్ ని పట్టాలెక్కించడం కష్టంగా భావించడంతో తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కమిట్ అయిన ప్రాజెక్ట్ లన్నీ పూర్తయ్యే వరకూ కొత్త సినిమాలకు డేట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతోనే వినోధ్ సమయం వృద్ధా కాకుండా గ్యాప్ ని ఇలా పిల్ చేస్తున్నాడు.