కమర్శియల్ మోజులో ప్రేక్షకుల్ని డైవర్ట్ చేస్తున్నాడా?
టాలీవుడ్ ఆడియన్స్ అభిరుచి మారిన వేళ. కొత్త జానర్ సినిమాలకు జనాలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు
టాలీవుడ్ ఆడియన్స్ అభిరుచి మారిన వేళ. కొత్త జానర్ సినిమాలకు జనాలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ఆదరణ దక్కుతుంది. ఇమేజ్ ని పక్కనబెట్టి థియేటర్ కివచ్చి సినిమా చూస్తున్నారు. సినిమాలో విషయం ఉందంటే? ఎంతైనా ఖర్చు చేసి థియేటర్ కి వస్తున్నారు. పరభాషల సినిమాలు మన ఇండస్ట్రీలో వందలకోట్లు వసూళ్లు సాధిస్తున్నాయంటే? మన ఆడియన్స్ లో మార్పు చోటుచేసుకుందో గెస్ చేయోచ్చు.
కాంతార..2018...ది కేరళ స్టోరీ లాంటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని వసూళ్లే అందుకు సాక్ష్యం. అందులో స్టార్లు లేరు. కేవలం కథ..పాత్రలు మాత్రమే ప్రేక్షకుల్ని థియేటర్ వరకూ తీసుకెళ్లగలిగాయి అన్నది వాస్తవం. ఇంకా వెబ్ సిరీస్ లు..ఓటీటీ కంటెంట్ లో వినూత్నంగా చిత్రాలకు గొప్ప ఆదరణ దక్కుతుంది. తెలుగు ప్రేక్షకుల్లో ఈ రకమైన మార్పు ఎప్పుడొస్తుందా? అని ఎంతో కాలంగా కళ్లకు కాయలు కాచేలా ఎదురు చూసింది ఇండస్ట్రీ. ఇప్పుడా మార్పు రానే వచ్చింది.
వినూత్నమైన సినిమాలు చేయండి..అవియూనిక్ గా ఉండాలి. ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలిగించాలి. అలాంటి సినిమాలు మేమెందుకు ఆదరించం అని గొప్ప ఆదరణకి నోచుకుంటున్నాయి. మరి అలాంటి ఆడియన్స్ పై టాలీవుడ్ లో ఒకరిద్దరు దర్శకులు..ప్రముఖంగా ఓ దర్శకుడు మళ్లీ పాత చింతకాయ పచ్చడినే రుద్దే ప్రయత్నం చేస్తున్నాడా? మరిచిపోయిన పాత మసాలా సినిమాలు తీసి మళ్లీ మీరు ఇలాంటివే చూడాలని గట్టిగా చెబుతున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది.
ఆ యంగ్ డైరెక్టర్ ఇప్పటివరకూ ఐదారు సినిమాలు చేసాడు. అవన్నీ కమర్శియల్ గా మంచి విజయాలు సాధించాయి. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ మాత్రమే చేసాయి. మరి వాటిలో కొత్త అంశం ఏదైనా ఉందా? అంటే భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా దొరకదు. అవన్నీ సక్సస్ అవ్వడంతో సదరు దర్శకుడు ఆ కమర్శి యల్ పార్మెట్ ని వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఓ స్టార్ హీరోతో సినిమా చేసాడు. అది రేపో..మాపో రిలీజ్ అవుతుంది.
అదీ పక్కా కమర్శియల్ సినిమా. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఆ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా? లేదా? అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. కానీ ఇలాంటి జానర్ సినిమాలు ఆడియన్స్ మైండ్ ని డిస్టబెన్స్ క్రియేట్ చేసే సినిమాలే. డైరెక్టర్లంతా యూనిక్ గా వెళ్తుంటే అతనొక్కడే! పాత ఫార్మాట్ ని పట్టుకుని వేలాడుతున్నాడు. ఇలాంటోళ్లు మరో ఇద్దరు ఉన్నారు. ఆ ముగ్గురు కేవలం స్టార్ ఇమేజ్ తోనే సినిమాలు ఆడుతున్నాయి అన్న విషయం వీలైనంత త్వరగా గుర్తించాలి.