హీరోయిన్ల గోంతెమ్మ కోర్కెలు ఇక చెల్ల‌వా?

సినిమా హిట్ అయితే ఓ లెక్క ..ఫ‌ట్ అయితే మ‌రో లెక్క లోనూ ఓటీటీలు రిలీజ్ చేస్తున్నాయి.

Update: 2024-12-19 15:30 GMT

రిలీజ్ విష‌యంలో ఓటీటీలో కొండెక్కి కూర్చుంటున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో కండీష‌న్ల మ‌ధ్య ఓటీటీ రిలీజ్ లు జ‌రుగుతున్నాయి. మునుప‌టిలా కంటెంట్ డిమాండ్ చేసి కొన‌డం లేదు. ఓటీటీని నిర్మాత బ్ర‌తిమ‌లాడి కంటెంట్ అమ్మాల్సి వ‌స్తోంది. అందుకు థియేట్రిక‌ల్ రిలీజ్ అన్న‌ది కీల‌క పాత్ర పోషిస్తుంది. సినిమా హిట్ అయితే ఓ లెక్క ..ఫ‌ట్ అయితే మ‌రో లెక్క లోనూ ఓటీటీలు రిలీజ్ చేస్తున్నాయి. అలా రిలీజ్ చేయాల‌న్నా? నిర్మాత‌లు ఎన్నో కండీష‌న్ల‌కు అంగీక‌రించాల్సి వ‌స్తోంది.

అయితే ఇప్పుడీ ప్ర‌భావం హీరోయిన్ల‌పై ప‌డింద‌నే ఓ వార్త వెలుగులోకి వ‌చ్చింది. నిర్మాత‌లిప్పుడు హీరోయిన్లు అడిగి నంత పారితోషికం ఇవ్వ‌డం లేదుట‌. బేర‌మాడి? మార్కెట్ ను బేరీజు వేసుకుని? పారితోషికం చెల్లిస్తున్న‌ట్లు స‌మా చారం. కొత్త భామ‌ల విష‌యంలోనూ కాదు సీనియ‌ర్ భామ‌లైనా? ఫాంలో ఉన్న హీరోయిన్లు అయినా స‌రే ఈ ప్రాతి ప‌దికనే నిర్మాత‌లు ఒప్పందం చేసుకుంటున్నారుట‌.

ఇటీవ‌లే ఓ స్టార్ హీరోయిన్ తో ఓ నిర్మాత అగ్రిమెంట్ చేసుకోవ‌డానికి వెళ్లిన స‌మ‌యంలో? ఓటీటీ ప‌రిస్థితి పూర్తిగా వివ‌రించి... హీరోయిన్ డిమాండ్ ఎంత‌? నిర్మాత‌గా తాను ఎంత చెల్లింగ‌ల‌ను? సినిమా హిట్ అయితే వ‌చ్చే లాభ న‌ష్టాల‌న ఓ అంచ‌నాగ ఆ హీరోయిన్ కి చెప్పాడుట‌. స‌ద‌రు భామ ఇవ‌న్నీ నాకెందుక‌ని అడిగిందిట‌. అందుకా నిర్మాత ఆ లెక్క‌ల‌న్నీ మీకు తెలియాల‌ని సూచించాడుట‌. నిర్మాత కండీష‌న్లు అన్నీ త‌న‌కి ఒకే అయితేనే ఒప్పందం చేసుకుందామ‌ని..లేదంటే? ఇప్పుడే తేల్చి చెప్పేయండ‌ని అన్నాడుట‌. దీంతో ఆ హీరోయిన్ ఆ నిర్మాత‌ని హోల్డ్ లో పెట్టిన‌ట్లు తెలిసింది.

అలాగే కొంత మంది హీరోయిన్లు క‌థ‌ల విష‌యంలో ఏమాత్రం అవ‌గాహ‌న లేకుండా క‌మిట్ అవ్వ‌డం నిర్మాత‌కు న‌ష్టం తెస్తుంద‌నే అంశం తెర‌పైకి వ‌చ్చింది. కొంత మంది హీరోయిన్లు అవ‌గాహ‌నలేమీతో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. నిర్మాత ఓ క‌థ చెబితే? తీరా సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత మ‌రో క‌థ‌లో న‌టిస్తున్నారుట‌. ఇలా ఎందుకు జ‌రుగుతుంది? అని నిర్మాత‌ల్ని హీరోయిన్లు అడ‌గ‌డమే లేదుట‌. అక్క‌డే వాళ్ల ఢొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డుతుంది. పారితోషికం వ‌చ్చిందా? లేదా? అన్న‌ది చూస్తున్నారు త‌ప్ప చేసిన సినిమా హిట్టా? ప‌ట్టా అన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని...పని ప‌ట్ల నిబ‌ద్ద‌త లేకుండా కొంత మంది వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ఓ నిర్మాత చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News