భాగ్యనగరంలో గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ హల్చల్!
తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ వేసింది. నేటి నుంచి హైదరాబాద్ లో ఏకధాటిగా 35 రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రం 'కూలీ' లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చెన్నై సహా వివిధ ప్రాంతాల్లొ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ వేసింది. నేటి నుంచి హైదరాబాద్ లో ఏకధాటిగా 35 రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే రజనీకాంత్ హైదరాబాద్ కి చేరుకున్నారు. అయితే నేడు రజనీ సెట్స్ లో జాయిన్ అవుతారా? లేదా? అన్నది క్లారిటీ లేదు.
ఆయన లేకపోతే ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం ఉంది. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో తెరెక్కుతోన్న థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో రజనీ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఇంత వరకూ రజనీ ఇలాంటి పాత్ర పోషించింది లేదు. గతంలో భాషా సినిమాలో మాఫియా డాన్ ని ఎదురించే మరో డాన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్రకు పూర్తి భిన్నంగా ఇందులో రోల్ ఉంటుంది.
లోకేష్ మార్క్ లో రజనీ రోల్ డిజైన్ చేయబడింది. దీంతో ఆ పాత్ర ఎలా ఉంటుంది? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో అంతకంతకు పెరిగిపోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. దీంతో తదుపరి అప్ డేట్స్ పై ఆసక్తి నెలకొంది. ఇటీవలే టీమ్ తో పాటు సత్యరాజ్ కూడా జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అతడి లుక్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.
రజనీ-సత్యరాజ్ 40 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న చిత్రం కావడంతో? సత్యరాజ్ పాత్ర ఎలా ఉంటుంది? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నో వివాదాలకు ఈ కలయికతో పుల్ స్టాప్ పడింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. 'జైలర్' తర్వాత మరోసారి రజనీ సినిమాకి సంగీతం అందించడం వివేషం.