బుకింగ్స్ లో స్కామ్ ఈ రేంజ్ లో ఉంటుందా?
మరి ఇప్పుడు వాడుతోన్న ఈ కార్పోరేట్ బుకింగ్ అనే మాట పై చిత్రాలకు ఎంతవరకూ వర్తిస్తుందో తెలియ దుగానీ.. తొలిసారి ఈ మాట టాలీవుడ్ లో తెరపైకి వస్తోంది.
స్టార్ హీరోల సినిమాలు వందల కోట్లు వసూళ్లు తెచ్చాయని ఎక్కువగా వినిపిస్తుంటుంది. తెలుగు సినిమా పాన్ ఇండియాకి కనెక్ట్ కాని రోజుల్లోనే! ఈ వసూళ్ల మాట సునామీలా ప్రవహించేది. 100 కోట్లు..150 కోట్లు..200 కోట్లు వసూళ్లు అంటూ పోస్టర్లు వెలిసేవి. అయితే అందులో అసలైన వాస్తవాలు ఏంటి? అన్నది తెలియదు. పోస్టర్లు వేసి చెబితే తప్ప ఆ సినిమా అంత తెచ్చిందా? అని ఆశ్చర్యపోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఏ ఏరియా నుంచి ఎంత తెచ్చాయి అన్నది వసూళ్లు క్లారిటీ లేని అంశంగా కనిపించేది.
కాల క్రమంలో పాన్ ఇండియాలో తెలుగు సినిమా సక్సెస్ అవ్వడంతో! వసూళ్ల పరంగా ఓ క్లారిటీ కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాడుతోన్న ఈ కార్పోరేట్ బుకింగ్ అనే మాట పై చిత్రాలకు ఎంతవరకూ వర్తిస్తుందో తెలియ దుగానీ.. తొలిసారి ఈ మాట టాలీవుడ్ లో తెరపైకి వస్తోంది. సాధారణంగా ఈ పదం బాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇప్పుడు కూడా బాలీవుడ్ సినిమా కారణంగానే కార్పోరేట్ బుకింగ్ అన్నది వెలుగులోకి వచ్చిందనుకోండి. ఇటీవల రిలీజ్ అయిన 'యానిమల్' సినిమా 800 కోట్లకు పైగావసూళ్లని సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఇది 1000 కోట్లు వసూళ్లు సాధిస్తుందని వేగం చూసి అంతా భావించారు. కానీ ఈ సినిమా వెయి కోట్ల క్లబ్ లో చేరలేదు. ఇదే విషయంగు గురించి చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ కార్పోరేట్ బుకింగ్ పద్దతిని అనుసరించి ఉంటే యానిమల్ కూడా ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరేదని అన్నారు. తమ సినిమా కేవలం నిజాయితీగా సాధించే వసూళ్లు గురించి మాట్లాడుకోవాలి తప్ప అనవసర ఆర్భాటం వద్దు అనుకున్నాం కాబట్టే ఆగాం అన్న తరహాలో వ్యాఖ్యానించారు. అసలు కార్పోరేట్ బుకింగ్ అంటే? ఏంటి? అంటే...ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ కి రెడీ అయిన సమయంలో దానికి బజ్ తక్కువగా...జనాల్లోకి వెళ్లకపోయినా ఓపెనింగ్స్ పెద్దగా రావని భావించి బల్క్ బుకింగ్స్ కి తెర తీస్తారు.
అంటే ఓపెద్ద కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ సంస్థ తరుపున భారీగా ప్రీ టికెట్లు బుక్ చేయడం. అందుకు అవసరమయ్యే డబ్బు అంతా నిర్మాత సమకూర్చడమో...హీరోకి సంబంధిం చిన వారు ఏర్పాటు చేయడమో జరుగుతుంది. కేవలం ఆ కార్పోరేట్ కంపెనీ తరుపున టికెట్లు బుక్ అయినట్లు మాత్రమే తెలుస్తుంది. ఇలా చాలా కార్పోరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం..డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వడం వంటివి జరుగుతుంటాయి. తద్వారా సినిమా జనాల్లో హిట్ గా వెళ్తుంది. ఇవన్నీ ప్రణయ్ రెడ్డి మాటల ద్వారా స్పష్టమవుతోంది.