మరోసారి చిన్నారి సెంటిమెంట్ లో డాకు మహరాజ్

డాకు మహరాజ్‌లో కీలకమైన 'చిన్నీ' అనే సాంగ్‌ని డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఈ పాటలో బాలకృష్ణ ఒక చిన్న పాపతో కలిసి కనిపిస్తారు.

Update: 2024-12-19 14:28 GMT

సంక్రాంతి బరిలో నిలవబోయే డాకు మహరాజ్ సినిమా నందమూరి బాలకృష్ణ క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లనుందని ఫ్యాన్స్ ఎంతగానో నమ్ముతున్నారు. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

 

నందమూరి బాలకృష్ణ నటన, థమన్ మ్యూజిక్, బాబీ కట్టుదిట్టమైన కథనంతో ఈ సినిమా సంక్రాంతి పండగను మరింత ఘనంగా మార్చనుందని ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ఇక లేటెస్ట్ విడుదలైన 'చిన్నీ' సాంగ్ పోస్టర్‌తో కథలో కీలకమైన చిన్న పాప పాయింట్ హైలెట్ కానున్నట్లు అర్ధమవుతుంది. డాకు మహరాజ్‌లో కీలకమైన 'చిన్నీ' అనే సాంగ్‌ని డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఈ పాటలో బాలకృష్ణ ఒక చిన్న పాపతో కలిసి కనిపిస్తారు.

పల్లె వాతావరణంలో తండ్రి కూతుళ్ల బంధాన్ని సూచించే ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ సినిమాకు ఒక సాఫ్ట్ టచ్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించే అంశంగా మారింది. బాలకృష్ణ పంచే ఎమోషన్ ప్రతి ప్రేక్షకుడిని కదిలించేలా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో చిన్న పిల్లలతో ఉండే కథా ప్రధాన అంశాలు సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అఖండలో బాలకృష్ణ, చిన్న పాప మధ్య ఉండే బంధం ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ ఎమోషనల్ సీన్లు సినిమాకు కలిసొచ్చి అఖండను బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టాయి. ఇదే ఫార్ములా ఎన్టీఆర్ RRRలో కూడా కనిపిస్తుంది, ఆయన పాప కోసం బ్రిటిష్ వారితో చేసే పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ బింబిసారలో కూడా చిన్నారికి సంబంధించిన ఎమోషనల్ ఎలిమెంట్స్ కథలో కీలకంగా నిలిచాయి. ఇప్పుడు బాలకృష్ణ 'డాకు మహరాజ్'లో కూడా అదే తరహాలో స్టోరీ పాయింట్ కీలకంగా మారనుందని తెలుస్తోంది.

బాలకృష్ణ కెరీర్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉన్న కథలు చాలా సార్లు విజయాలను అందించాయి. ఇక ఇప్పుడు 'డాకు మహరాజ్'లో కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆసక్తి పెంచుతోంది. దర్శకుడు బాబీ కొల్లి ఈ అంశాన్ని చాలా ఎమోషనల్‌గా మలిచారని టాక్. సంక్రాంతి రేసులో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు ఉన్నాయి. అయితే డాకు మహరాజ్ యాక్షన్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ పాయింట్‌ను ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతోంది. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించే అవకాశాలను పెంచుతోంది. థమన్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం అవుతుందన్న నమ్మకంతో సినిమా యూనిట్ ఉంది.

Tags:    

Similar News