అడివి శేష్.. ప్రేమతో శత్రుత్వం!

టాలీవుడ్ లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు అడవి శేష్.

Update: 2024-06-15 06:10 GMT

టాలీవుడ్ లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు అడవి శేష్. ప్రస్తుతం అడవి శేష్ గూఢచారి సీక్వెల్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో చేస్తున్నాడు. అలాగే డెకాయిట్ అనే సినిమా కూడా తెరకెక్కుతోంది. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షాన్ లీ డియో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డెకాయిట్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి ఏడాదికి పైగా అవుతోంది.

అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకి రాలేదు. కంప్లీట్ న్యూ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అడవి శేష్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. సినిమాలో అడవి శేష్, శృతి హాసన్ శత్రువులు అయిన మాజీ ప్రేమికులుగా కనిపిస్తున్నారు. అయితే గ్లింప్స్ లో స్టొరీ ఏంటనేది క్లారిటీ ఇవ్వలేదు. తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది. డెకాయిట్ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక కథనం ప్రచారం అవుతోంది. శృతి హాసన్, అడవి శేష్ ప్రేమించుకొని అనుకోని పరిస్థితిలో విడిపోతారంట. తరువాత ఇద్దరు కూడా దొంగలుగా మారుతారంట. ఆ తరువాత ఊహించని విధంగా ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడటం జరుగుతుందంట. అసలు వీరు ఎందుకు దొంగలుగా మారారు.

ఒకరిపై ఒకరికి అంత శత్రుత్వం ఎందుకు పెరిగింది అనేది డెకాయిట్ కథలో భాగంగా ఉంటుందని టాక్. ఈ సినిమా షాన్ లీ డియోతో పాటు అబ్బూరి రవి, అడవి శేష్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా గురించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. మరో వైపు గూఢచారి సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సీక్వెల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మేజర్ మూవీ తర్వాత అడవి శేష్ నుంచి ఈ రెండు సినిమాలు రాబోతున్నాయి. మరి వీటిలో ఏది సూపర్ హిట్ అయ్యి అడవి శేష్ కి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ తీసుకొస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మేజర్ మూవీతో అడవి శేష్ కి పాన్ ఇండియా హీరో ఇమేజ్ వచ్చేసింది. డెకాయిట్, గూఢచారి సినిమాలు రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే అతని మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉందంట. అలాగే శృతి హాసన్ కూడా ఈ సినిమాతో మరో బిగ్ హిట్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నీ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News