దంగ‌ల్ రికార్డ్ బ్రేక్.. ఓవ‌ర్సీస్‌లో నం.1 ఆసియా చిత్రం

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ 'దంగల్' ఆల్ టైమ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది.

Update: 2024-04-24 03:51 GMT

ఓవ‌ర్సీస్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా 'దంగ‌ల్' ఇప్ప‌టివ‌ర‌కూ రికార్డుల్లో నిలిచింది. కానీ ఇప్పుడు ఈ రికార్డును ఒక జ‌ప‌నీ చిత్రం బ్రేక్ చేసింది. ఈ సినిమా ఇటీవ‌ల ఆస్కార్ పుర‌స్కారాన్ని గెలుచుకుంది. వివ‌రాల్లోకి వెళితే...

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ 'దంగల్` ఆల్ టైమ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన ఆసియా చిత్రంగా రికార్డుల‌కెక్కింది. 2024 వరకు ఏడేళ్ల పాటు నం.1 స్థానంలో నిలిచిన‌ స్పోర్ట్స్ డ్రామాగా రికార్డును కలిగి ఉంది.

'దంగల్` దీర్ఘకాల బాక్సాఫీస్ రికార్డ్‌ను బ్రేక్ చేయ‌డానికి ఇప్ప‌టికి ఒక సినిమా వ‌చ్చింది. అది కూడా ఒక‌ ఆస్కార్ విన్నింగ్ మూవీతో ఇది సాధ్యమైంది. నిజానికి దంగ‌ల్ భార‌త‌దేశంలో వ‌సూలు చేసింది చాలా త‌క్కువ‌. కానీ చైనాలో విడుదలైన తర్వాత అన్ని ఆసియా రికార్డుల‌ను అధిగమించింది. ఓవర్సీస్‌లో అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును సృష్టించింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 1400 కోట్లు (222మి.డాల‌ర్లు).. ప్రపంచవ్యాప్తంగా 1900 కోట్లు వసూలు చేసింది.

ఇప్పుడు జపనీస్ `యానిమే, ది బాయ్ అండ్ ది హెరాన్` ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద $239.6 మిలియన్లు సంపాదించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ సంవత్సరం అకాడమీ అవార్డ్స్ వేడుకలో `ది బాయ్ అండ్ ది హెరాన్‌`కి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలింగా అవార్డు లభించింది. ఇది బాక్సాఫీస్ వద్ద దాని ప్రేక్ష‌కాదరణను పెంచింది. దంగల్ పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డు చివరకు బద్దలైంది.

ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగు ఆసియా చిత్రాల వివ‌రాల్ని ప‌రిశీలిస్తే..

1. ది బాయ్ అండ్ ది హెరాన్ (2023) - $239.6 మిలియన్ (జపాన్) , 2. దంగల్ (2016) - $233.80 మిలియన్ (భారతదేశం), 3. పారాసైట్ (2019) - $230.50 మిలియన్ (దక్షిణ కొరియా), 4. సుజుమ్ (2022) - $224.7 మిలియన్ (జపాన్) .. ఈ జాబితాలో రెండు ఆస్కార్-విన్నింగ్ చిత్రాలు (ది బాయ్ అండ్ ది హెరాన్, పారాసైట్).. రెండు యానిమేటెడ్ చిత్రాలు (ది బాయ్ అండ్ ది హెరాన్, సుజుమ్) ఉన్నాయి.

భారతీయ చిత్రాలలో దంగల్ ఓవర్సీస్ స‌హా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొనసాగుతోంది. భారతదేశంలో దంగల్ రూ. 387.38 కోట్లు వసూలు చేసింది. భార‌త‌దేశంలో బాహుబ‌లి 2 రికార్డును దంగ‌ల్ బ్రేక్ చేయ‌లేదు. ప్రస్తుతం జవాన్, యానిమల్, గదర్ 2, పఠాన్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, KGF: చాప్టర్ 2 తర్వాత హిందీలో ఆరవ అతిపెద్ద వసూళ్లను సాధించిన సినిమాగా దంగ‌ల్ రికార్డుల్లో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ నటించిన దంగ‌ల్ రూ. 1968.03 కోట్లను ఆర్జించింది. దీని తర్వాత బాహుబలి 2: ది కన్‌క్లూజన్, RRR, KGF: చాప్టర్ 2, జవాన్, పఠాన్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద గ్రాసర్ లుగా నిలిచాయి.

మహేష్ బాబుతో SS రాజమౌళి త‌దుప‌రి చిత్రం `దంగల్` రికార్డును బద్దలు కొట్టి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించవచ్చని ఇప్పుడు భావిస్తున్నారు.

Tags:    

Similar News