జైల్లో తొలి రాత్రి ఇలా..ఒంటరిగా ఆమె రోధన!
ఇతర ఖైదీల బ్యారక్ లో ఉంచితే సమస్యలు వస్తాయని భావించి ఇలా సపరేట్ చేసారు. ఇక మహిళా బ్యారెక్ లో పవిత్రని ఉంచారు.
రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడ్ పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దర్శన్ కంటే ముందే పవిత్రని ఆ జైలుకు తరలించడం అటుపై జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ మిగిలిన నిందుతులందర్నీ అదే జైలుకు తరలించడం తో ప్రేక్షకుల ఫోకస్ అంతా అగ్రహారం జైలుపైనే ఉంది. మరి తొలి రోజు రాత్రి దర్శన్ జైలు జీవితం ఎలా గడించిందంటే? శనివారం రాత్రి భోజనానికి రాగి సంగటి, అన్నం, సాంబారు, మజ్జిగ, ఆకుకూర పులుసు అందించారు.
రాత్రి అరకొరకగానే భోజనం చేసి దర్శన్ ఆలస్యంగా నిద్రపోయాడు. ఉదయం ఆరున్నరకు లేచి తాగడానికి వేడి నీళ్లు కోరాడు. అనంతరం కొంత సమయం పాటు బ్యారెక్స్ అవరణలో వాకింగ్ చేసి స్నానం చేసాడు. అల్పాహారంగా రైస్ బాత్ ఇచ్చారు. ఈ కేసులో అరెస్ట్ అయి రెండు వారాలు పూర్తవ్వడంతో బరువు కూడా తగ్గాడు. బీపీ నియంత్రణలో లేదని గుర్తించారు. దర్శన్ కోసం ప్రత్యేకంగా ఓ బ్యారక్ ని కేటాయించారు.
ఇతర ఖైదీల బ్యారక్ లో ఉంచితే సమస్యలు వస్తాయని భావించి ఇలా సపరేట్ చేసారు. ఇక మహిళా బ్యారెక్ లో పవిత్రని ఉంచారు. ఇతర ఖైదీలు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆమె ఒంటరిగా రోధిస్తూ కారాగారంలో ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. పలువురు ఆమెకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దర్శన్ తో పాటు కేసులో భాగమైన మిగతా వారికి కూడా 13 రోజుల పాటు రిమాండ్ విధించారు.
బెంగుళూరుకు బధులుగా తుమకూరు కారాగారానికి తరలించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనలను దర్శన్ తరుపు న్యాయవాది తోసిపుచ్చారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. అలాగే దర్శన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఆయన కుటుంబ సభ్యులు, పలుకుబడి ఉన్న వ్యక్తులంతా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.