దసరా సినిమాలు డిజిటల్ రిలీజ్ ఎక్కడంటే?

భగవంత్ కేసరి సినిమా హక్కులు ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ రైట్స్ కూడా ప్రైమ్ వీడియోని దక్కించుకుంది. విజయ్ లియో చిత్రం హక్కులు నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది.

Update: 2023-10-14 04:11 GMT

ఈ దసరాకి ఒక్క మలయాళం నుంచి తప్ప సౌత్ లో మూడు భాషలలో నాలుగు సినిమాలతో పాటు హిందీలో ఒక మూవీ థియేటర్స్ కి రాబోతున్నాయి. ఈ సినిమాలు అన్ని వేటికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. కన్నడంలో శివరాజ్ కుమార్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ ఘోస్ట్ మాఫియా నేపథ్యంలో ఉండబోతోంది. ఈ చిత్రంపై కన్నడనాట భారీ అంచనాలు ఉన్నాయి.

తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరి, మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు భిన్నమైన జోనర్ లో వస్తోన్న సినిమాలే. ఇకటి కమర్షియల్ యాక్షన్ అయితే, రెండోది పీరియాడిక్ బయోపిక్. తమిళంలో దళపతి విజయ్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో మూవీ రిలీజ్ కాబోతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతోనే ఈ చిత్రం తెరకెక్కింది.

బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ హీరోగా గణపత్ మూవీ థియేటర్స్ లోకి రానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతోంది. ఈ సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడయ్యాయి. భగవంత్ కేసరి సినిమా హక్కులు ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ రైట్స్ కూడా ప్రైమ్ వీడియోని దక్కించుకుంది.

విజయ్ లియో చిత్రం హక్కులు నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది. ఈ రైట్స్ ద్వారా 50 శాతం బడ్జెట్ నిర్మాతకి రికవరీ అయిపొయింది. శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ రైట్స్ జీ5 సొంతం చేసుకుంది. గణపత్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇలా ఈ స్టార్ హీరోల చిత్రాలు అన్ని కూడా రిలీజ్ కి ముందే డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతకి కొంత పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చాయి.

వీటిలో మూవీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ బట్టి దీపావళి నాటికి కొన్ని ఒటీటీలోకి వచ్చేసే అవకాశం ఉంది. థియేటర్స్ లో మంచి ఆదరణ వస్తే మాత్రం డిజిటల్ రిలీజ్ కాస్తా లేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు.

Tags:    

Similar News