గొడవల్లేకుండా సంక్రాంతి డేట్లు!

ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సీజన్‌లో టాలీవుడ్‌లో భారీ చిత్రాలు విడుదలవ్వడం ఒక ఆనవాయితీగా మారింది.

Update: 2024-11-11 09:42 GMT

ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సీజన్‌లో టాలీవుడ్‌లో భారీ చిత్రాలు విడుదలవ్వడం ఒక ఆనవాయితీగా మారింది. ఇక 2025 సంక్రాంతికి మళ్ళీ అద్భుతమైన చిత్రాలను సిద్ధం చేస్తున్నారు. అయితే డేట్స్ విషయంలో సినిమా నిర్మాతల మధ్య కొంత రచ్చ కొనసాగింది. ఇక మరికొన్ని సినిమాలు సంక్రాంతి క్లాష్ నుంచి తప్పుకోక తప్పలేదు. ఫైనల్ గా సంక్రాంతికి గొడవలు లేకుండా సినిమా రేంజ్ కు తగ్గట్టుగా డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. ఒకదానితో ఒకటి పోటీ లేకుండా కొంత గ్యాప్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్, NBK109, సంక్రాంతికి వస్తున్నాం, మజాకా సినిమాలు పొంగల్ లో విడుదల కాబోతున్నాయి.

ఇక సంక్రాంతికి తెరపై సందడి చేయబోతున్న మొదటి చిత్రం రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్". ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం, చరణ్‌కు ఒక ప్రత్యేక హిట్‌ను అందిస్తుందని అంతా భావిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో రెండో అతిపెద్ద సినిమాగా బాలకృష్ణ నటించిన ఎన్బీకే 109 చిత్రం రాబోతోంది. ఈ జనవరి 12న విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సమయంలో ప్రేక్షకులకు ఈ సినిమా పెద్ద ఉత్సాహాన్ని తెస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక సంక్రాంతిలో మూడో చిత్రం వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం రాబోతోంది. జనవరి 14న సంక్రాంతి రోజున విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్టర్. యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్‌ మిక్స్ కావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్‌కు సరైన పండుగ చిత్రంగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్న నాలుగో చిత్రం సందీప్ కిషన్ నటించిన మజకా. కమర్షియల్ హిట్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 15న విడుదల కానుంది. ఈ చిత్రం కామెడీ, ఎమోషన్, రొమాన్స్ అంశాలతో సరదాగా రూపొందించబడింది. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ప్రేక్షకులను కట్టిపడేసే అన్ని అంశాలు మజకాలో ఉండబోతున్నాయని మేకర్స్ అంటున్నారు. ఈ సంక్రాంతి సీజన్‌లో నాలుగు డిఫరెంట్ సినిమాలు విడుదల అవుతుండడంతో, బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతీ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉండడంతో, ప్రేక్షకులు సంక్రాంతి పండుగ రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయడం ఖాయం.

Tags:    

Similar News