DeAr ట్రైల‌ర్: ఆవిడ‌కేమో గుర‌క‌.. ఈయ‌న‌కేమో నిద్ర‌లేమి

ఒక‌రికేమో నిదుర అస్స‌లు ప‌ట్ట‌ని రోగం.. దీంతో క‌ళ్ల‌పై న‌ల్ల గుడ్డ క‌ప్పుకుని మ‌రీ ప‌డుకుంటాడు. ఇక నైటంతా శోభ‌నం కోసం పెళ్లికూతురు మేల్కొనే ఉంటుంది

Update: 2024-04-06 16:44 GMT

ఆవిడ‌కేమో గుర‌క రోగం.. ఈయ‌న‌కేమో నిద్ర‌లేమి రోగం.. ఇలాంటి ఇద్ద‌రిని సంబంధం వెతికి మ‌రీ పెళ్లి చేస్తే ఆ ఇంట్లో ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ఊహించ‌గ‌ల‌రా? .. ఇదిగో ఈ జంట పాట్లు గ‌మ‌నిస్తే మీరే చెబుతారు. వైజాగ్ కుర్రాడు జీవీ ప్ర‌కాష్ కి ఇంట్లో పెద్ద‌లు పిల్ల‌(ఐశ్వ‌ర్య రాజేష్‌)ను వెతికారు. పెళ్లి చేసారు. కానీ మొద‌టి రాత్రి కే అస‌లు భండారం బ‌య‌ట‌ప‌డిపోయింది. య‌థావిధిగానే ఫ‌స్ట్ నైట్ లో ఇద్ద‌రూ తెలివిగానే ఉన్నారు.

ఒక‌రికేమో నిదుర అస్స‌లు ప‌ట్ట‌ని రోగం.. దీంతో క‌ళ్ల‌పై న‌ల్ల గుడ్డ క‌ప్పుకుని మ‌రీ ప‌డుకుంటాడు. ఇక నైటంతా శోభ‌నం కోసం పెళ్లికూతురు మేల్కొనే ఉంటుంది. అయితే ఆమె త‌లుపు ప‌క్క‌నే కుర్చీలో ఆద‌మ‌రిచి నిదురిస్తుంది. అలా నిదురించిన త‌ర్వాత మొద‌ల‌వుతుంది చూడూ డోలు బాజా.. గుర‌కే గుర‌క‌.. ఆ గుర‌క సౌండ్ కి ఊరూ వాడా మేల్కోవాల్సిందే. నిదుర‌లోంచి తుళ్లిప‌డి లేచే జీవీ ప్ర‌కాష్‌కి అస‌లు నిజం తెలిసాక అంతే సంగ‌తి.

మొత్తానికి ద‌ర్శ‌కుడు ఎంపిక చేసుకున్న థిన్ లైన్ ఎంతో ఇంప్రెస్సివ్ అన‌డంలో సందేహం లేదు. బోలెడంత ఫ‌న్ ఎమోష‌న్ ని ర‌గిలించేందుకు ఆస్కారం ఉన్న మంచి ఇతివృత్తాన్ని అత‌డు ఎంచుకున్నాడు. దానిని ఎంతో తెలివిగా ఎగ్జిక్యూట్ చేశాడ‌నేందుకు ఈ ట్రైల‌ర్ స‌రిపోతుంది. జివి ప్రకాష్ - ఐశ్వర్య రాజేష్ జంట‌గా న‌టించిన `డిఆర్` త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఆద్యంతం ఫ‌న్ ఎలిమెంట్స్ తో కుటుంబ ఆడియెన్ ని మెప్పించే కంటెంట్ తో ఆక‌ట్టుకుంది.

ఈ ట్రైలర్ లో నాగ‌చైత‌న్య‌ వ్యాఖ్యాతగా తన వాయిస్‌ని అందించారు. అరేంజ్డ్ మ్యారేజ్‌లో పాట్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ రీతూతో పెళ్లి చేసుకున్న కథానాయకుడు అర్జున్‌ని అశ్విన్ ని ప‌రిచ‌యం చేస్తాడు. రీతు బిగ్గరగా గురక పెట్టడం వల్ల లైట్ స్లీపర్ అర్జున్ ఆందోళన చెందడంతో అస‌లు గొడ‌వ మొద‌ల‌వుతుంది. ఈ జంట పెళ్లి నిష్క్రియంగా మారుతుంది. వారి భవిష్యత్తు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. దురదృష్టకర వివాహంలో ప్రేమ, హాస్యం, నాటకీయతతో సినిమా ఆద్యంతం న‌వ్వులు పూయిస్తూనే ఎమోష‌న్ ని ర‌గిలిస్తుంది. ట్రైలర్‌లో చాలా ఫన్నీ, రొమాంటిక్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆక‌ట్టుకున్నాయి. `సేతుమ్ ఆయిరమ్ పొన్` ఫేమ్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించ‌గా, జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. జివి ప్రకాష్ సంగీతం అందించ‌గా, రుకేష్ ఎడిటింగ్ చేసారు. అన్న‌పూర్ణ స్టూడియోస్- ఏషియ‌న్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అందిస్తున్నాయి.

Full View
Tags:    

Similar News