బాక్సాఫీస్.. డిసెంబర్ లో పెద్ద లిస్టే ఉందే..

ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతూ ఉంటాయి

Update: 2023-08-15 04:44 GMT

ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతూ ఉంటాయి. వాటిలో టాలీవుడ్ లో కూడా చిన్న, పెద్ద చిత్రాలు కలుపుకొని తక్కువలో తక్కువ 300 సినిమాల వరకు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఏడాదిలో ఉన్నదీ 365 రోజులు. టాలీవుడ్ లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ ఐయ్యేది ప్రతి శుక్రవారం. ఆ రోజైతే వీకెండ్ వస్తుందని మెజారిటీ చిత్రాలు శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి.

అవి కాకుండా ఫెస్టివల్ సీజన్ సినిమాల పండగ ఉంటుంది. ఇలా రిలీజ్ అయ్యే సినిమాలలో 10 నుంచి 15 శాతం మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంటాయి. ఒక్కో నెలలో అయితే గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకే రోజు మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే ఈ ఏడాది డిసెంబర్ నెలలో టాలీవుడ్ లో మూవీ ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే చెప్పాలి.

డిసెంబర్ 1న రణబీర్ కపూర్ పాన్ ఇండియా మూవీ యానిమల్ రిలీజ్ అవుతోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా వస్తూ ఉండటం కొంత బజ్ ఉంది. డిసెంబర్ 8న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ కాబోతోంది. దాంతో పాటు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా డిసెంబర్ 8న రాబోతోంది. నెక్స్ట్ ధనుష్ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ డిసెంబర్ 15న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న డిసెంబర్ 21న ప్రేక్షకులని పలకరించనుంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నానికి జోడీగా నటిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ సైంధవ్ డిసెంబర్ 22న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. సిదీర్ బాబు మైథలాజికల్ ఫిక్షనల్ మూవీ హరోంహర కూడా అదే రోజు రిలీజ్ కి అవ్వబోతోంది.

డిసెంబర్ 23న వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ఎక్స్ట్రా మూవీ రిలీజ్ అవ్వనుంది. ఇలా డిసెంబర్ నెలలో మొదటి మూడు వారాల్లోనే ఏకంగా ఎనిమిది సినిమాలు తెలుగు ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకమైన మూవీ. డిఫరెంట్ జోనర్ లో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఈ సినిమాల విషయంలో ఆడియన్స్ టేస్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి.

Tags:    

Similar News