దీపిక కళ్లకు ప్లాటైపోయిన డైరెక్టర్లు!
బాలీవుడ్ లో చక్రం తిప్పుతోన్న బెంగుళూరు బ్యూటీ దీపికా పదుకొణే ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడిలో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి
హీరోయిన్ల అందానికి ఫిదా కానిది ఎవరు? అభిమానులే కాదు..మేము సైతం అంటూ! ఎంతో మంది దర్శక-నిర్మాతలు- హీరోలు కూడా హీరోయిన్ల బ్యూటీని సందర్భం వచ్చినప్పుడు పొగిడేస్తుంటారు. తాజాగా ఇద్దరు దర్శకులు కూడా ఓ హీరోయిన్ కళ్లకు ప్లాటైపోయినట్లు తెలుస్తోంది. అవును ఇంతకీ ఎవరా హీరోయిన్? ప్లాటైపోయిన ఆ డైరెక్టర్లు? ఎవరు? అంటే! వివరాల్లోకి వెళ్లాల్సిందే.
బాలీవుడ్ లో చక్రం తిప్పుతోన్న బెంగుళూరు బ్యూటీ దీపికా పదుకొణే ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడిలో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. అందుకే అంత పెద్ద హీరోయిన్ అయింది. ఐశ్వర్యారాయ్ తర్వాత బెంగుళూరు నుంచి ముంబైకెళ్లి అంత ఫేమస్ అయిన నటి కూడా దీపికనే. దీపిక హైట్ ని లైక్ చేసే వారు కొంత మందైతే..ఆమె అందాన్ని మెచ్చుకునేది మరికొంత మంది.
ఎక్కువగా దీపిక ముక్కు అంటే పిచ్చెక్కిపోయేది ఎంతో మంది మంది. దీపికా కి సైతం తన ముక్కు అంటే ఎంతో ఇష్టం అంటుంది. తాజాగా అట్లీ కూడా దీపిక కళ్లని చూసి ప్లాట్ అయిపోయాడుట. దీపిక కళ్లతోనే హవభావాలు పలికించడం అట్లీకి ఎంతో ఇష్టమట. జవాన్ లో అవకాశం కూడా అందుకే ఇచ్చాడుట. సన్నివేశంలో మార్పు చేసినా దానికి తగ్గట్టు అప్పటికప్పుడు లుక్స్ మార్చడం తనకి తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదంటున్నాడు.
అందుకే డైలాగులు చెప్పే సమయంలో ఎక్కువగా క్లోజప్ షాట్స్ తీసానంటున్నాడు. తన పాత్రలో లీనమైపోతుందని... జవాన్ సినిమాలో దీపిక నటించడం తన లక్కీ అని అంటున్నాడు. అలాగే టాలీవుడ్ మేకర్ నాగ్ అశ్విన్ కూడా దీపిక ఐస్ గురించి ఓ సందర్భంలో ఆకాశానికి ఎత్తేసాడు. ఆయన కూడా దీపిక కళ్లలో గొప్ప నటిని చూసిన దర్శకుడు.
ప్రాజెక్ట్ -కె లో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను పరిశీలించి దీపికని ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణం ఆమె ఐస్ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అలాగే కోలీవుడ్ నటుడు సూర్య కళ్లని కూడా చాలా మంది సెలబ్రిటీలు లైక్ చేస్తుంటారు. హీరోయిన్లతో పాటు నటులు కూడా సూర్య కళ్లతోనే నటించగల గొప్ప నటుడని అంటారు. రానా..ప్రభాస్ లాంటి వారు ఈ విషయాన్ని ఓపెన్ గానే ఒప్పుకున్నారు.