దీపికా పదుకొణే తో ఇటలీలో రొమాన్స్!
ఇటలీ అందాల్లో కొత్త షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ హృతిక్-దీపికలపై ఓ రొమాంటిక్ గీతాన్ని చిత్రీకరించనున్నారు.
రొమాంటిక్ సన్నివేశాల్లో దీపికా పదుకోణే ఎలివేషన్లు ఏ రేంజ్లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ అమ్మడి రొమాంటిక్ సన్నివేశాల్లో ఆడిపాడే విధానం ఎంతో ఇంట్రెస్టింగ్. చిట్టి పొట్టిదుస్తుల్లో..బికినీ కాస్ట్యూమ్స్ లో చర్చకు తెర తీస్తుంది. 'పఠాన్' లో బేషరమ్ సాంగ్ తో ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అమ్మడు ధరించిన కాషాయ రంగు బికినీ బీజేపీలో పెద్ద ప్రకంపనలే రేపింది.
ఈ నేపథ్యంలో తాజాగా దీపిక మరోసారి రొమాంటిక్ గీతంలో అలరించడానికి రెడీ అవుతోంది. హృతిక్ రోషన్ కథానాయకుడిగా సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో 'ఫైటర్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. నిన్న మొన్నటివరకూ ముంబైలో షూటింగ్ నిర్వహించిన యూనిట్ తాజాగా ఇటలీకి పయనమైంది. ఇటలీ అందాల్లో కొత్త షెడ్యూల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ హృతిక్-దీపికలపై ఓ రొమాంటిక్ గీతాన్ని చిత్రీకరించనున్నారు. మొత్తం మూడు పాటలు..కొన్ని కీలక సన్నివేశాల కోసం ఇటలీ వెళ్లారు.
దీనిలో భాగంగా ముందుగా రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారుట. బ్లాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈపాటలో దీపిక అందంగా కనిపించనుందిట. పాట కోసం ప్రత్యేక వస్త్రాల్లో డిజైన్ చేసారుట. ఇటలీ అందాలు...పాటలో రసకిత్వాన్ని ఆద్యంతం హైలైట్ చేసేలా ఆ దుస్తులు ఉండబోతున్నాయట. పాటలో మరింత గ్లామరస్ గా కనిపించనుందిట. పాటలో భాగంగా హృతిక్ తో రియలిస్టిక్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకోనుందని తెలుస్తోంది.
మరి అమ్మడి అందాలు ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తుందో చూడాలి. ఈ పాట అనంతరం హృతిక్ పై ఓ సోలోగీతాన్ని చిత్రీకరించనున్నారుట. విశాల్ దడ్లానీ-శేఖర్ రవ్ జియానీ అందిస్తున్న పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టీమ్ ధీమా వ్యక్తం చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలోనే చిత్రాన్ని ప్రేక్షకు లముందుకు తీసుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలో షూటింగ్ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తు న్నారు. ఇప్పటికే ఇండియాలో మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసారు. ఇటలీ షెడ్యూల్ కూడా పూర్తయితే చిత్రీకరణ దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లేనని తెలుస్తోంది.