నిశ్చితార్థం అయినా గుట్టు దాచేసిన‌ న‌టి!

దీపిక తన డిప్రెషన్ సమస్యల గురించి ఈ వేదిక‌పై ఓపెన్ గా మాట్లాడింది.

Update: 2023-10-28 02:30 GMT

క‌ర‌ణ్ జోహార్ కాఫీ విత్ క‌ర‌ణ్ అతిథులుగా స్టార్ క‌పుల్ రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే కొత్త‌ సీజన్‌ను ప్రారంభించారు. ఈ షోలో ఈ జంట తొలిసారి క‌లిసి క‌నిపించింది. అంతేకాదు క‌ర‌ణ్ సంధించిన చాలా ప్ర‌శ్న‌ల‌కు బ‌హిరంగంగా జ‌వాబులిచ్చారు. ర‌హ‌స్యాల‌న్నిటినీ ఓపెనైంది ఈ జంట‌. దీంతో ఎపిసోడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. దీపిక తన డిప్రెషన్ సమస్యల గురించి ఈ వేదిక‌పై ఓపెన్ గా మాట్లాడింది. తన కష్టతరమైన దశలో రణవీర్ తనకు ఎలా సహాయం చేసాడో .. ఎలా అండగా నిలిచాడో కూడా ఆమె వెల్లడించింది. ఇద్ద‌రితో లైఫ్ లో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని, ఆ ఇద్ద‌రూ త‌న‌కు క‌ష్ట కాలంలో అండ‌గా నిల‌వ‌లేద‌ని కూడా దీపిక వెల్ల‌డించింది.

అయితే దీపిక 2015లో రణ్‌వీర్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించడంతో చాలా మంది దృష్టిని ఆకర్షించాడు. నిశ్చితార్థం అయ్యాక‌ మూడేళ్లపాటు చాలా రహస్యంగా ఉంచగలిగారు. అతను దీపికకు బహుమతిగా ఇచ్చిన డైమండ్ రింగ్ గురించి ప్రశ్నించినప్పుడు రణ్‌వీర్ హాస్యభరితంగా త‌న‌దైన శైలిలో మాట్లాడాడు. ''అవును సార్,.. ఆ సమయంలో నా వనరులకు మించి కానుక అది. బ‌హుశా అది త‌న‌ను చాలా ఆకట్టుకుంది'' అని అన్నాడు. మాల్దీవులకు రొమాంటిక్ డేట్ కి వెళ్లిన సమయంలో దీపికకు ప్రపోజ్ చేసినట్లు వెల్లడించారు.


ఆ ప్రత్యేక క్షణాన్ని గుర్తుచేసుకుంటూ రణవీర్ నాటి సంగ‌తుల‌ను గుర్తుచేసుకున్నాడు, 'రామ్-లీలా' విజయం తర్వాత మేము డేటింగ్ దశలో ఉన్నాము. ఒకానొక సమయంలో 'ఇది సరైన సమయం' అని నేను భావించినప్పుడు త‌న‌కు ప్ర‌పోజ్ చేయాల‌ని నిర్ణయించుకున్నాను.

ఇంకేదైనా జరగకముందే, ఉంగరం పెట్టేయాల‌నుకున్నాను. ఉంగరాన్ని సంపాదించడానికి నేను మా చెల్లి అమ్మతో కలిసి కుట్ర చేసాను. మేము సెలవుదినం కోసం ప్లాన్ చేసాం.

ఆ సెలవులో దీపిక‌కు ప్రపోజ్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నేను ఉంగరాన్ని సంపాదించాను. మా కుటుంబం ''నువ్వు ప్రపోజ్ చేయబోతున్నావా?'' అని అడిగారు. ఆమె తల్లిదండ్రులను సంప్రదించావా? అని అడిగారు. అయితే అప్పటికి నాకు ఆ స్థాయి మెచ్యూరిటీ లేదు.. ''వద్దు.. పెళ్లి చేసుకోబోతున్నాను.. అందుకే డైరెక్ట్ గా అడుగుతాను'' అన్నాను. మేము మాల్దీవులకు వెళ్ళాము. నేను ఉంగరాన్ని రహస్యంగా తీసుకెళ్ళాను. మేము శాండ్‌బ్యాంక్ సాహసం చేసాము. ఎలాగోలా ప్ర‌పోజ్ చేసాను. త‌ను కూడా అవును అని చెప్పింది. ఉంగ‌రం తొడిగాను... అని నాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకున్నాడు. వారి ప్రేమకథ చివ‌రికి పెళ్లికి దారి తీసింది. 2018లో పెళ్లి చేసుకున్నారు.

Tags:    

Similar News